కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pooja Hegde New Movie News

ట్యాగ్ · 36 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

దీపకాంతి లో హీరోయిన్ పూజాహెగ్డే

కరోనా వైరస్ పై పోరాటానికి ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 9నిమిషాలపాటు దీప ప్రజ్వలనకై పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. భారతీయుల సమైక్యతా ప్రదర్శనకు ప్రతీకగా దేశవ్యాప్తంగా జరిగిన దీప ప్రజ్వలన జయప్రదం గా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రధాని మోదీ పిలుపుకు మద్దతు తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏ హీరోతో బుట్టబొమ్మ కెమిస్ట్రీ అదుర్స్..?

మొదట్లో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్... దానితో ఒకప్పుడు తమ సినిమాల్లో ఆ హీరోయిన్ ను పెట్టుకోవాలనుంటే కాస్త ఆలోచించేవారు.. కానీ పాత సామెత బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. ఇప్పుడు స్టార్ హీరోల పక్క హీరోయిన్ కావాలంటే తనే ఫస్ట్ ఛాయస్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా..? ఎవరో కాదు మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్ అప్ కమింగ్ మూవీతో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ - హ‌రీష్ సినిమాలో పూజా హెగ్డే?

‘గ‌బ్బ‌ర్ సింగ్‌’ (2012) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కబోతున్న ఈ చిత్రం కోసం మ‌రోసారి ఫ‌క్తు మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ని సిధ్ధం చేస్తున్నాడు హ‌రీష్. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ సంవ‌త్స‌రం చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాని పై పూజాహెగ్డే ప్రశంసలు

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే రీసెంట్ గా జార్జియా లో జరిగిన "Prabhas 20 మూవీ షూటింగ్ లో పాల్గొని ఇండియా తిరిగి వచ్చిన తరువాత స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే మీడియా తో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కోలీవుడ్ లో పూజాహెగ్డే రీ ఎంట్రీ ?

కోలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయ చిత్రం "ముగమూడి" 2012 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించినది. ఆ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం " మూవీ తో టాలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయం అయ్యారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన DJ, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "Prabhas 20 ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Pooja Hegde Reveals Interesting Titbits About Prabhas 20
సినిమా వార్తలు

#Prabhas 20 మూవీ పై పూజాహెగ్డే స్పందన

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రీసెంట్ గా జార్జియా షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా #Prabhas 20 మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం "#Prabhas 20", అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో పూజ నటించిన "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించటం తో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే "కభీ ఈద్ కభీ దివాలీ " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!

కొరటాల దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో పూజా హెగ్డే?

ఒక‌వైపు గ్లామ‌ర్ రోల్స్ లో మురిపిస్తూనే.. మ‌రోవైపు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లోనూ అల‌రిస్తోంది పూజా హెగ్డే. వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ.. త్వ‌ర‌లో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో న‌టించ‌బోతోంద‌ట‌.

Team TFNవాట్సాప్
Pooja Hegde Sends Out Valentines Day Wishes On Social Media
సినిమా వార్తలు

పూజ హెగ్డే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు

సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజ హెగ్డే అనతి కాలం లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో సూపర్ హిట్ మూవీస్ లో నటించి, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Salman Khan To Pair Up With Pooja Hegde
సినిమా వార్తలు

బాలీవుడ్ హీరో సల్మాన్ కు జోడీగా పూజ హెగ్డే

అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల .. వైకుంఠపురములో .. వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో పూజ హెగ్డే టాలీవుడ్ లో అగ్ర తారగా రాణిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న #Prabhas 20 మూవీ, అఖిల్ "ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. పూజ హెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందే మూవీ లో కథానాయికగా పూజ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజా హెగ్డే ఖాతాలో ఏడాదికో `మెగా` హిట్

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న క‌థానాయిక‌ల్లో పూజా హెగ్డే ఒక‌రు. రీసెంట్ గా రిలీజైన `అల వైకుంఠ‌పుర‌ములో`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న సొంతం చేసుకుందీ స్ట‌న్నింగ్ బ్యూటీ. ఇదిలా ఉంటే.. పూజ టాలీవుడ్ కెరీర్ ని ప‌రిశీలిస్తే ఓ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదేమిటంటే... 2017 నుంచి ఏడాదికో మెగా కాంపౌండ్ హీరోతో జ‌ట్టుక‌ట్ట‌డ‌మే కాకుండా.. విజ‌యాల‌ను ఒడిసిప‌ట్టుకుంటోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
Pooja Hegde Entertains Audience With Back To Back Movies
సినిమా వార్తలు

2020లో పూజా హెగ్డే జోరు

ఈ ఏడాది `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`, `హౌస్ ఫుల్ 4` (హిందీ) చిత్రాల‌తో సంద‌డి చేసిన స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే... వ‌చ్చే ఏడాది ఏకంగా ఐదు సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. వీటిలో మూడు తెలుగు చిత్రాలుంటే... మ‌రో రెండు హిందీ ఫిల్మ్స్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అజిత్ కోసమా..? పవన్ కోసమా..?

ఇప్పటికే పింక్ రీమేక్ ను పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది రెండు రోజుల క్రితం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను దిల్ రాజు తో పాటు బోనీ కపూర్ కూడా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. బోనీ కపూర్ ఇప్పటీకే ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ అనే పేరుతో అక్కడ రీమేక్ చేసారు. ఇక ఆ సినిమా అక్కడ హిట్ కొట్టడంతో మళ్ళీ అదే కాంబినేషన్ లో ‘వలిమై’ అనే సినిమాను కూడా చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో పూజ హెగ్డే ?

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈమూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రెడీ చేయడం లో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్ సినిమాలో జాయిన్ అయిన పూజ..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా ఆమె ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ 2 తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తొలిరోజు సెట్ లో ఆమె ఎలా గడిపారో వీడియో ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్