కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mega Powerstar Ram Charan Tej

ట్యాగ్ · 15 కథనాలు

SS Rajamouli Magnam Opus RRR Movie Climax Shooting Begins Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SS Rajamouli,Mega Powerstar Ram Charan Tej,Jr NTR,RRR,RRR Movie,RRR Film,RR
షూటింగ్ అప్‌డేట్

'RRR' క్లైమాక్స్ షూట్

మొత్తానికి రెండేళ్ల పైన కృషికి మరికొద్దిరోజుల్లో తెర పడనుంది. రాజమౌళి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం). లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా రాజమౌళి షూటింగ్ ను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. "వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్‌, సీతారామరాజు ఏకమయ్యారు. క్లైమాక్స్‌ షూటింగ్‌ మొదలయ్యింది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది" అని ట్వీట్ లో పేర్కొన్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' - మహాబలేశ్వర్ లో కొత్త షెడ్యూల్

ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే దాదాపు 50రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి కంప్లీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నైట్ షూట్ కు గుడ్ బై చెప్పిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

కరోనా వల్ల దాదాపు 8నెలలు షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీం ఈమధ్యే షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. అంతేకాదు హెవీ వింటర్ లో కూడా షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే పలు వీడియోలు పోస్ట్ చేస్తూ తెలియచేస్తూనే వున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఫైనల్ గా నైట్ షెడ్యూల్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాదాపు 50రోజుల పాటు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను నైట్స్ లో చలిలో ఇన్ని రోజులు చిత్రీకరణ చేశాం. ఫైనల్ గా ఈ షూట్ అయిపోయింది. త్వరలో మరో కొత్త…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామరాజు ఛాలెంజ్ పూర్తి చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు తమ సన్నిహితులకు కూడా ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటాడు. అనంతరం అలియా భట్, దర్శకుడు రాజమౌళి, తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేక్షకాదరణ పొందిన "రంగస్థలం"

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టార్ హీరోయిన్ సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆది పినిశెట్టి , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. "రంగస్థలం "మూవీ ప్రేక్షకాదరణ పొంది పలు అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
Actress Alia Bhatt To Join RRR Movie Shooting In November
షూటింగ్ అప్‌డేట్

నవంబర్ లో "RRR" షూటింగ్ లో అలియాభట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ తో "రౌద్రం రణం రుధిరం " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' షూట్ కోసం వెయిటింగ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా ఇన్నిరోజులకు హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'RRR' - భీమ్ స‌ర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్

మొత్తానికి ఏ సినిమా అప్ డేట్ కోసం.. ఏ సినిమా షూటింగ్ కోసం ఇన్ని రోజులు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో ఐడియా వచ్చింది కదా. ఇంకేంటి దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా. ఈ సినిమా అప్ డేట్ ఇస్తామని మేకర్స్ నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. కరోనా వల్ల మార్చి నుండి షూటింగ్ ను జరపలేదని.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశామని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోలో గేట్స్ తెర‌వ‌డం, దుమ్ము ప‌ట్టిన వ‌స్తువుల‌ను దుల‌ప‌డం, లొకేష‌న్ ప‌రిస‌రాల‌ని శుభ్ర‌ప‌ర‌చ‌డంకు సంబంధించిన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అలియాపై క్లారిటీ తో రాజమౌళి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపోటిజమ్ పై ఎన్ని చర్చలు జరిగాయో.. జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ నెపోటిజమ్ అనే కాన్సెప్ట్ వల్ల కొంతమంది బాలీవుడ్ వారసులు కూడా టార్గెట్ అయ్యారన్న సంగతి కూడా తెలుసు. అందులో ముఖ్యంగా అలియా బట్ కూడా ఒకరు. సడక్ 2 కు వచ్చిన డిస్ లైక్స్ ను చూస్తేనే చెప్పొచ్చు పాపం అలియా పై ఎంత ట్రోలింగ్ జరిగిందో. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కూడా అలియా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాజమౌళి అలియా ప్లేస్ లో ఇంకే హీరోయిన్ ను రీప్లేస్ చేయనని చెపుతున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు మా వంతు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ ఫ్యాన్స్ కు అండగా చరణ్, బన్నీ

పవన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలన్న నేపథ్యంలో ఆయన ఫ్లెక్సీ కడుతూ అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఘటన అటు అభిమానుల్లోనూ.. మెగా ఫ్యామిలీకి విషాదాన్ని మిగిల్చింది. ఇంకా పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. అంతేకాదు మృతుల కుటుంబాలు ఒక్కొక్క‌రికి రూ. 2ల‌క్ష‌ల చొప్పున ఆర్ధిక సాయం ప్ర‌క‌టించారు ప‌వ‌న్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్

హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఖైదీ నెం 150 ", "సైరా నరసింహా రెడ్డి " మూవీస్ ను నిర్మించారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లూరి సీతారామరాజుగా నటించడం అదృష్టం -రామ్ చరణ్

ఫ్రీడమ్ ఫైటర్ , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించడం ప్రతీ నటుడికీ యాంబిషన్ అని తెలిసిన విషయమే. అల్లూరి జీవిత చరిత్ర ఆధారంగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన "అల్లూరి సీతారామరాజు " మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు "సర్దార్ పాపారాయుడు ", "మేజర్ చంద్రకాంత్ ", హీరో బాలకృష్ణ "పరమవీర చక్ర ", "విజయేంద్ర వర్మ ", "ఎన్టీఆర్ బయోపిక్ " మూవీస్ లో అల్లూరి సీతారామరాజుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Actor Ram Charan to fulfill his mothers dream with Megastar Chiranjeevi New Movie Acharya
సినిమా వార్తలు

ఈ సినిమాతో మాఅమ్మ కల నిజమవుతుంది

ఫైనల్లీ మా అమ్మ డ్రీమ్ ఇన్నేళ్లకు నెరవేరుతుంది అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ డ్రీమ్ ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. చిరు-రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని చిరు సతీమణి.. రామ్ చరణ్ తల్లి సురేఖకు ఎప్పటినుండో కోరికట. అది ఆచార్య సినిమాతో మొత్తానికి నిజమవుతుందని చెపుతున్నాడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్

షేర్