అల్లూరి సీతారామరాజుగా నటించడం అదృష్టం -రామ్ చరణ్

I Am Fortunate To Play To Role Of Alluri Seetharamaraju Says Mega Powerstar Ramcharan

ఫ్రీడమ్ ఫైటర్ , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించడం ప్రతీ నటుడికీ యాంబిషన్ అని తెలిసిన విషయమే. అల్లూరి జీవిత చరిత్ర ఆధారంగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన “అల్లూరి సీతారామరాజు ” మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు “సర్దార్ పాపారాయుడు “, “మేజర్ చంద్రకాంత్ “, హీరో బాలకృష్ణ “పరమవీర చక్ర “,
“విజయేంద్ర వర్మ “, “ఎన్టీఆర్ బయోపిక్ ” మూవీస్ లో అల్లూరి సీతారామరాజుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో రామ్ చరణ్ అల్లూరిగా నటిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ మాట్లాడుతూ .. అల్లూరి సీతారామరాజు గా నటించడం తన అదృష్టం అనీ, అదృష్టం అనేది చిన్న పదం అవుతుందనీ , ఈ క్యారెక్టర్ లో నటించడం చాలా ఆనందం గా ఉందని , దర్శకుడు రాజమౌళి ఆ క్యారెక్టర్ ను ఎంతో గౌరవం , బాధ్యత తో ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారనీ తెలిపారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకున్నాక రామ్ చరణ్ “RRR” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =