
ట్యాగ్ · 16 కథనాలు



మంచు మనోజ్ పెళ్లి డేట్ ఫిక్స్

మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్..!

మనోజ్ మంచు మంచి నిర్ణయం
మనోజ్ మంచు స్లిమ్ లుక్
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మనోజ్ హై కిక్ - సీరియస్ వర్కౌట్స్
మనోజ్ మంచు సినీ జర్నీ
ఎన్టీఆర్ Vs మనోజ్ - అంతా తూచ్..!

"#NTR30" మూవీలో విలన్ గా మనోజ్ మంచు ?
మంచు మనోజ్ కోసం రానున్న రామ్ చరణ్
కొత్త సినిమా వివరాలు త్వరలో..!

ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన మంచు మనోజ్

పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ దంపతులు
మంచు వారి ఇంట ఆనందం నెలకొంది. మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తండ్రిగా కూడా ప్రమోట్ అయ్యాడు. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు వారు నలుగురు అయ్యారు.. దేవుళ్ల ఆశీర్వాదంతో దేవత వచ్చింది. మనోజ్, మౌనిక ఎంతగానో ఎదురుచూస్తున్న బేబి గార్ల్ ను పొందారని అనౌన్స్ చేయడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎంఎం పులి అని పిలస్తున్నాము అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఏడేళ్ళ గ్యాప్ తర్వాత, ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తున్నా - మంచు మనోజ్
తమని ఎంతగానో అభిమానించే అభిమాని కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ‘ఉస్తాద్’, ఇంత గొప్ప కాన్సప్ట్ ని హోస్ట్ చేయడం చాలా ఆనందంగా వుందిని పేర్కొన్నారు రాక్ స్టార్ మంచు మనోజ్. ఈ మేరకు ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్’ ర్యాంప్ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్ షో ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈనేపధ్యంలో ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

వైభవంగా జరిగిన మంచు మనోజ్, మౌనికా రెడ్డి ల వివాహం
హీరో మంచు మనోజ్, మౌనికారెడ్డిల వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మంచు కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మనోజ్, మౌనిక వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఫిల్మ్ నగర్‌లోని మోహన్‌బాబు ఇంటిలోనే వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. మనోజ్, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. మంచు మోహన్‌బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.

మంచు మనోజ్ పెళ్లి డేట్ ఫిక్స్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. తన నుండి సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దికాలంగా మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే కదా. 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. బేధాభిప్రాయాలతో విడిపోయిన సంగత్ తెలిసిందే. మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న తరవాత మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకోరు…

మంచు మనోజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం బ్రహ్మాస్మి మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. త్వరలోనే స్పెషల్ న్యూస్ ఒకటి చెప్తా అంటూ మంచు మనోజ్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా మనం మనం బరంపురం క్యాప్షన్ తో What The Fish... మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ లాంఛ్ చేసి తన ఫాలోవర్లకు మనోజ్ గుడ్‌న్యూస్ చెప్పారు.

మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్..!
మళ్లీ సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం చూపిస్తుంది. గత ఏడాది ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. ఇప్పుడు మళ్లీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక ఈవిషయాన్ని స్వయంగా మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ''నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల నుంచి నాతో కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. అవసరమైన జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు'' అని మనోజ్ ట్వీట్ చేశాడు.

మనోజ్ మంచు మంచి నిర్ణయం
సూపర్ హిట్ "మేజర్ చంద్రకాంత్ " మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన మనోజ్ మంచు "దొంగ దొంగది "మూవీ తో హీరోగా మారి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మనోజ్ ప్రస్తుతం తన స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం లో మనోజ్ మంచు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "అహం బ్రహ్మస్మి "మూవీ లో హీరోగా నటిస్తున్నారు. "అహం బ్రహ్మస్మి "మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మనోజ్ మంచు స్లిమ్ లుక్
"మేజర్ చంద్రకాంత్ "మూవీ లో బాలనటుడిగా పరిచయం అయిన మనోజ్ మంచు సూపర్ హిట్ "దొంగ దొంగది " మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. "ఒక్కడు మిగిలాడు "(2017 ) మూవీ తరువాత మనోజ్ నటనకు గ్యాప్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ నెలకొల్పారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "అహం బ్రహ్మస్మి "మూవీ లో హీరోగా నటిస్తున్నారు.
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్‌ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.
మనోజ్ హై కిక్ - సీరియస్ వర్కౌట్స్
చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు.
మనోజ్ మంచు సినీ జర్నీ
విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మనోజ్ మంచు "దొంగ దొంగది " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "దొంగ దొంగది " మూవీ 2004 సంవత్సరం ఆగస్ట్ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "శ్రీ ", "నేను మీకు తెలుసా ?", "బిందాస్ ", "వేదం ", కరెంట్ తీగ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత మనోజ్ "అహం బ్రహ్మస్మి " మూవీ లో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ Vs మనోజ్ - అంతా తూచ్..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో `అయిననూ పోయి రావలే హస్తినకు` అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాపై ఏదో ఒక వార్త బయటకి వస్తూనే వుంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. దానిపై ఇంకా క్లారిటీ రాకముందే రెండు రోజులుగా మరో రూమర్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో నటించే విలన్ పాత్రపై. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అసలు ఎవరూ ఊహించని పేరు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తాడని వార్తలొచ్చాయి.

"#NTR30" మూవీలో విలన్ గా మనోజ్ మంచు ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీం గా నటిస్తున్నారు." RRR" మూవీ తరువాత ఎన్టీఆర్ "#NTR30" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#NTR30" మూవీ తెరకెక్కనుంది.
మంచు మనోజ్ కోసం రానున్న రామ్ చరణ్
దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు. ఇక ఈ సినిమా రేపు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మనోజ్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా రానున్నాడు. రేపు ఉదయం 8 గంటలకు ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో రామ్…
కొత్త సినిమా వివరాలు త్వరలో..!
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు.

ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన మంచు మనోజ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా మోటర్స్ మొదటి కారును నిన్న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తుండగా.. మంచు మనోజ్ కూడా దీనిపై తన ట్విట్టర్ ద్వారా స్పందించి ఓ ట్వీట్ చేశారు. 'కియా మోటార్స్' మొదటి వెహికల్ మన ఏపీలో తయారు చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని.. వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపూర్ లో దీనిని నెలకొల్పడం కారణంగా అక్కడి ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనిని ఏపీకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి బిగ్ చీర్స్ అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.