
ట్యాగ్ · 14 కథనాలు


మహేష్ బాబు సినిమాతో బిజీ

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29

మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్

#SSMB28 కు పోకిరి సెంటిమెంట్

#SSMB 28.. వర్క్ అండ్ చిల్

'మహేష్' మోకాలికి సర్జరీ..!

సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు'

'మహేష్' సినీ ప్రస్థానానికి 42 ఏళ్లు..!

"#SSMB 28 "షూటింగ్ నవంబర్ లో ?

'మహేష్' బర్త్ డే బ్లాస్టర్ కు టైమ్ ఫిక్స్

ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ రిక్వెస్ట్

SSMB 28షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB 28(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లాంగ్ గ్యాప్ తరువాత మళ్ళీ స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు కేవలం 20శాతం మాత్రమే షూటింగ్ ను పూర్తి చేసుకోగా త్రివిక్రమ్ కు వున్న కమిట్మెంట్ వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఫ్రీ అయిపోయవడం అలాగే మహేష్ బాబు వొకేషన్ నుండి తిరిగి రావడంతో తదుపరి షెడ్యూల్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు.వచ్చే నెల 7నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది.ఈషెడ్యూల్ నుండి కంటిన్యూ షూటింగ్ కు ప్లాన్ చేస్తుంది టీం. ప్రస్తుతం మేకర్స్ ఈసినిమాకు టైటిల్…

మహేష్ బాబు సినిమాతో బిజీ
దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారి వస్తున్న కాంబినేషన్ కాబట్టి అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం ఇప్పటికే ఒక సాలిడ్ కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఈసినిమా అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఉంటుందని.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతోందని…

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకె క్కుతుంది. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాండ్సమ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ రాజకుమారుడు అని అందుకే అంటారు తనను. ఇక ఈమధ్య మహేష్ ను చూస్తుంటే రోజు రోజుకి మహేష్ వయసు తగ్గిపోతుందా అన్నట్టు తన మేకోవర్ ను మార్చుకుంటున్నాడు. సర్కారు వారి పాట సినిమాకే తన మేకోవర్ ను మార్చేసి స్టైలిష్ లుక్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈమధ్య కాలంలో కూడా తను ఏ పిక్ పెట్టినా కూడా అది వైరల్ గా అవుతుంది.

#SSMB28 కు పోకిరి సెంటిమెంట్
రీసెంట్ గానే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టగా తన తరువాత సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో జరుపుకున్నారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈగ్యాప్ లోనే ఫ్యాన్స్ ను రిలీజ్ డేట్ ఇచ్చి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే ఇదే రోజున పోకిరి సినిమా రిలీజ్ అయింది. పోకిరి సినిమా రిలీజ్ అయి పలు సంచలనాలు సృష్టించడంతో ఇక ఇదే రోజున మహేష్…

'సర్కారు వారి పాట' శివరాత్రి కి స్పెషల్ పోస్టర్..!
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే కళావతి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం.. ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని దూసుకుపోతుంది.

#SSMB 28.. వర్క్ అండ్ చిల్
ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మహేష్ మోకాలికి సర్జరీ అవ్వడంతో షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. నిజానికి మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.. కానీ ఆతరువాత ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'మహేష్' మోకాలికి సర్జరీ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కు సర్జరీ అంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తుంది. నిజానికి మహేష్ ఎప్పటినుండో సమస్యతో ఇబ్బందిపడుతున్నారట. మోకాలినొప్పితో బాధపడుతున్న మహేష్ బాబుకు స్పెయిన్‌లో ఆపరేషన్ జరిగింది. మహేష్ ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. మహేష్ కోలుకున్నాక మళ్లీ షూట్ లో పాల్గొననున్నారు. మరోవైపు మహేష్ అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు'
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సోషల్ మీడియాలో కూడా అదే హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హీరోలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. తమ సినిమాల గురించి వ్యక్తి గత విషయాలు ఇంకా ఏదైనా అప్ డేట్ ఇవ్వాలన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలియచేస్తున్నారు.

'మహేష్' సినీ ప్రస్థానానికి 42 ఏళ్లు..!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా నెంబర్ వన్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తన నటనతో.. ప్రయోగాత్మక సినిమాలతో ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. ఇక టాలీవుడ్ లో అందగాడు ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు మహేష్. అందుకే టాలీవుడ్ రాకుమారుడు అయ్యాడు.

"#SSMB 28 "షూటింగ్ నవంబర్ లో ?
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణ. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. #SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'మహేష్' బర్త్ డే బ్లాస్టర్ కు టైమ్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట అప్ డేట్ రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఆగష్ట్ 9న మహేష్ పుట్టిన రోజు వస్తుండగా ఆరోజు కూడా ట్రీట్ ఉండబోతుందని ఇప్పటికే చెప్పారు. ఇక చెప్పినట్టే నేడు అప్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9, ఉదయం 9.09గంటలకు `సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్` పేరుతో ట్రీట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ రిక్వెస్ట్
కరోనా వల్ల హీరోలు తమ బర్త్ డే లను సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజును వేడుకలను జరిపే అవకాశం లేకుండా పోయింది. లేకపోతే ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక మరో మూడు రోజుల్లో మహేష్ బాబు బర్త్డే వస్తున్న సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ఆనందపడాల్సిందే కానీ బహిరంగ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి. ఇక తన పుట్టిన రోజుకు మహేష్ ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదేంటంటే..తన బర్త్ డే సందర్భంగా తన అభిమానులను మొక్కలు నాటాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

'సర్కారు వారి పాట' కూాడా మొదలు
పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తైంది. ఇక కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. దీంతో చాలా రోజుల పాటు దీనికి గ్యాప్ ఇచ్చారు. ఇక, తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. కరోనా నిబంధనల ప్రకారం చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణను ప్రారంభించారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి.. ఆ తరువాత పరిస్థితులు ఇంకా కాస్త సాధారణస్థితికి వచ్చిన తరువాత అప్పుడు విదేశాల్లో…