సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సోషల్ మీడియాలో కూడా అదే హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హీరోలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. తమ సినిమాల గురించి వ్యక్తి గత విషయాలు ఇంకా ఏదైనా అప్ డేట్ ఇవ్వాలన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు సినిమా కలెక్షన్స్ విషయంలో హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో అలానే సోషల్ మీడియాలో ఫాలోవర్లు సంఖ్య మీద కూడా పోటీ ఉంటుంది. అయితే మహేష్ ఆ విషయంలో కూడా ముందున్నాడు. 2010లో ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన మహేష్ బాబు ప్రతి ఏడాది తన ఫాలోవర్లను పెంచుకుంటూ ఇప్పుడు ఆ సంఖ్య 12 మిలియన్స్ కు చేరుకుంది. దీంతో ట్విట్టర్ ప్రపంచంలో మహేష్ బాబు సరికొత్త రికార్డును అందుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వారిలో మహేష్ బాబు మొదటి స్థానంలో నిలిచాడు. ఇక అభిమానులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాగా మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి రిలీజ్ చేసిన బ్లాస్టర్ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
![Video thumbnail](https://img.youtube.com/vi/rZP3U2lmAM8/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/bmeRIiXw9oE/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/3Uk8djquv8I/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/6HUnBmpsNdU/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)