
దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారి వస్తున్న కాంబినేషన్ కాబట్టి అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం ఇప్పటికే ఒక సాలిడ్ కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఈసినిమా అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఉంటుందని.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతోందని హింట్స్ అయితే ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఎం.ఎం.శ్రీలేఖ ఒక అప్ డేట్ అయితే ఇచ్చారు. తాజాగా శ్రీలేఖ విజయేంద్ర ప్రసాద్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేస్తూ.. న్యూ బిగినింగ్.. ప్రసాద్ నాన్న గారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాను.. మహేష్ సినిమాకోసం అన్నయ్య రాజమౌళి తో బిజీగా ఉన్నా అంటూ పోస్ట్ లో తెలిపింది.

కాగా ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు, నటీనటులు వివరాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.







