సూపర్ స్టార్ మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB 28(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లాంగ్ గ్యాప్ తరువాత మళ్ళీ స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు కేవలం 20శాతం మాత్రమే షూటింగ్ ను పూర్తి చేసుకోగా త్రివిక్రమ్ కు వున్న కమిట్మెంట్ వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఫ్రీ అయిపోయవడం అలాగే మహేష్ బాబు వొకేషన్ నుండి తిరిగి రావడంతో తదుపరి షెడ్యూల్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు.వచ్చే నెల 7నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది.ఈషెడ్యూల్ నుండి కంటిన్యూ షూటింగ్ కు ప్లాన్ చేస్తుంది టీం. ప్రస్తుతం మేకర్స్ ఈసినిమాకు టైటిల్ ను ఫైనల్ చేసే పనిలో వున్నారు.ఈనెల 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా టైటిల్ ను వదలునున్నారు.ఇదిలావుంటే ప్రచారంలోకి రోజుకో టైటిల్ వస్తుంది.మరి ఈసినిమాకు ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగాశ్రీ లీలమరో హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: