
ట్యాగ్ · 178 కథనాలు


అఫీషియల్.. SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్

సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్

మహేష్ కు రౌడీ హీరో స్వీట్ రిక్వెస్ట్

మహేష్ లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా

పెళ్లి యానివర్శిరీపై మహేష్ లవ్లీ పోస్ట్

మహేష్ తో అలాంటి సినిమా తీస్తా

మహేష్ హీరోయిన్స్ తో సితార స్పెషల్ బాండింగ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఎంజాయ్ చేశా

8 ఏళ్లు అయినా శ్రీమంతుడు కొత్త రికార్డులు

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్

వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' విడుదల తేదీపై ఎట్టకేలకూ క్లారిటీ వచ్చేసింది. వారణాసి నగరంలో వెలిసిన వినూత్నమైన హోర్డింగ్‌ల ద్వారా ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ నిన్నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

అఫీషియల్.. SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్
'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. '#SSMB29' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో దీనిపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది.

రీరిలీజ్‌కి సిద్ధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ SSMB29గా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్-వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఆయన సరికొత్తగా కనిపించనున్నారని సమాచారం. దీనికోసం మహేష్ బాబు స్పెషల్ మేకోవర్ అయ్యారని తెలుస్తోంది.

ఆ హాలీవుడ్ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డిస్నీ యొక్క విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు ఆయన డబ్బింగ్ చెప్తుండటం విశేషం. కాగా గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ప్రీక్వెల్‌గా వస్తోంది. ఇండియాలో ఈ యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.

తండ్రికి తగ్గ తనయుడు, రియల్ సూపర్ స్టార్..మహేష్ బాబు
దివంగత నటుడు, టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నట వారసుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ఫిల్మ్ 'మురారి' నేడు రీరిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఆయన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళితో #SSMB అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన సినీ జీవితంపై తెలుగు ఫిల్మ్ నగర్ స్పెషల్ స్టోరీ..

మహేష్ కు రౌడీ హీరో స్వీట్ రిక్వెస్ట్
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు కూడా. ఇక ఈ సందర్భంగా ఫ్యాన్స్ పలువురు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రౌడీహీరో కూడా తన ఇన్ట్సా ద్వారా బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్త్ డే మహేష్ సర్ .. బిగ్ స్క్రీన్ పై మిమ్మల్ని చూడటానికి ఎక్కువ వెయిట్ చేయించకండి.. మీరు ఎప్పుడు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ పేర్కొన్నాడు. దీంతో రౌడీహీరో చేసిన స్వీట్ రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మహేష్ లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది.ఈ సంక్రాంతికి గుంటూరు కారం తో వచ్చిన మహేష్ తన నెక్స్ట్ మూవీని టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తో చేయనున్నాడు.ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.ఈసినిమా పనిమీద దుబాయ్ కి వెళ్లి ఈరోజు హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు మహేష్ బాబు,రాజమౌళి,ఎస్ఎస్ఎమ్ బి 29 నిర్మాత కేఎల్ నారాయణ .

పెళ్లి యానివర్శిరీపై మహేష్ లవ్లీ పోస్ట్
టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తుంటారు. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 19ఏళ్లు పూర్తయింది.

మహేష్ తో అలాంటి సినిమా తీస్తా
మహేష్ తో తీస్తే అలాంటి సినిమా తీస్తా అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్. మరి ఎలాంటి సినిమా తీస్తాడు.. అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. తాాజాగా తెలుగు ఫిలిం నగర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారితో మీ డైరెక్షన్ లో సినిమా తీయాలనుకుంటే ఎలాంటి స్క్రిప్ట్ ను చేస్తారు అని అడగగా.. దానికి నరేష్ నవ్వుతూ బహుశా ఇది కలగానే మిగిలిపోతుంది అనుకుంటా.. మహేష్ ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అందరికీ తెలుసు.. మంచిగా బ్యాలెన్స్, మెయింటెనెన్స్ చేసే మనిషి. మహేష్ కూడా సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. ఖలేజా లాంటి బోల్డ్ కథతో రావడం.. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లడం.. ఆ ధైర్యం చేసే…

విదేశాలకు మహేశ్ బాబు.. సెండాఫ్ ఇచ్చిన నమ్రత, వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా 'గుంటూరు కారం' చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. మహేశ్ వన్ మేన్ షోగా నడిచిన ఈ మూవీ టాక్‌తో సంబంధం లేకుండా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ పలు రికార్డులు బద్దలు కొడుతోంది. మామూలు కథను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళడంలో ఒక స్టార్ హీరో ఇమేజ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో.. 'గుంటూరు కారం' కలెక్షన్స్‌తో మహేశ్ బాబు నిరూపించారు. ఆయన ఒంటిచేత్తో ఈ సినిమాను నిలబెట్టారంటే అతిశయోక్తి లేదు.

మహేష్ హీరోయిన్స్ తో సితార స్పెషల్ బాండింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుండే తన మార్క్ ను చూపిస్తూనే.. మీడియాలో హైలెట్ అవుతూ వచ్చిది. మొదల్లో నమ్రతా తన సోషల్ మీడియా ద్వారా సితార క్యూట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుండేది. అప్పుడే ఎంతో మందిని ఫిదా చేసేసింది. ఆ తరువాత ఏకంగా తనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి పలు వీడియోస్ తో అలరించింది. ప్రస్తుతం అప్పుడప్పుడు తన ఇన్ట్సా లో తను డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఎంజాయ్ చేశా
ఏదైనా సినిమా నచ్చితే దానిపై స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు సూపర్ స్టార్ మహేష్ బాబు. తమ ట్విట్టర్ ద్వారా నచ్చిన సినిమాలను ప్రశంసిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరో సినిమా మహేష్ ప్రశంసలను అందుకుంది. పి. మహేష్ బాబు దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ బాగా నచ్చింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్…

8 ఏళ్లు అయినా శ్రీమంతుడు కొత్త రికార్డులు
కొన్ని సినిమాలు రిలీజ్ అయి ఎన్నేళ్లయినా కూడా ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ రిపీట్ గా చూస్తునే ఉంటారు. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. యూట్యూబ్ లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వచ్చిన తరువాత ఏ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయొచ్చు. ఈ నేపథ్యంలోనే రిలీజ్ అయి 8 ఏళ్లు అయిపోతున్నా ఇంకా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది ఒక సినిమా. ఆ సినిమా మరేదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు.

'జవాన్' పై మహేష్ ట్వీట్.. షారుఖ్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఈ యేడాది ఆరంభంలో 'పఠాన్' మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన 'జవాన్' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా రేపు హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి సినీ పండితులు సైతం…

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం రీసెంట్ గా చిన్న చిన్న షెడ్యూల్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.ఈ గురువారం నుండి అన్నపూర్ణ స్టూడియో లో కొత్త షెడ్యూల్ స్టార్ కానుంది.ఈ షెడ్యూల్ లో మహేష్ జాయిన్ కానున్నాడు.ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.ఎలాగైనా నవంబర్ లోగా షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో వుంది చిత్ర బృందం.ఇక ఈసినిమా నుండి త్వరలోనే సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటివరకు రెండు పాటలు లాక్ చేశారట.అతి త్వరలో మొదటి పాటకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం.

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్
గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మహేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లు గానే షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే హాలిడే కు ఫారెన్ కు వెళ్లి తిరిగి వచ్చిన మహేష్ షూటింగ్ తో బిజీ అయ్యాడు.కొన్ని రోజుల క్రితం గుంటూరు కారం కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాగా నిన్నటి తో ముగిసింది.ఈషెడ్యూల్ లో మహేష్ మూడు రోజులు పాల్గొన్నాడు.కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట.ఇక రేపటి నుండి సారథి స్టూడియోలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

మహేష్ బాబు పెట్ డాగ్ మృతి.. నమ్రత, సితార భావోద్వేగం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పెంపుడు కుక్క మరణించింది. వారికి గల కుక్కల్లో ప్లూటో అనే పేరు కలిగిన ఈ కుక్క తాజాగా చనిపోయింది. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ మరియు కుమార్తె సితార సోషల్ మీడియా వేదికగా ఆ కుక్కతో తమకు గల అనుబంధాన్ని వెల్లడించారు. భావోద్వేగ పోస్టులతో ప్లూటోను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్లూటోని చాలా మిస్ అవుతున్నాం అంటూ ఒక పోస్టును పెట్టారు. ఆమె దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే, వారి కుమార్తె సితార కూడా ప్లూటో మృతికి హృదయపూర్వక నివాళిని పంచుకున్నారు. 'గత ఏడేళ్లుగా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్…

ఎంబీ ఫౌండేషన్ కు బిజినెస్ మేన్ కలెక్షన్స్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బిజనెస్ మేన్. ఈసినిమా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ఆగష్ట్ 9వ తేదీన రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రీరిలీజ్ లో కూాడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. రిలీజ్ అయిన మొదటిరోజే ఈసినిమా 4 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. అయితే ఈమధ్య రీరిలీజ్ కలెక్షన్స్ ను కూడా మంచిపని కోసం వాడుతున్నారు అభిమానులు. ఈనేపథ్యంలోనే బిజినెస్ మేన్ కలెక్షన్స్ ను కూడా మహేష్ అభిమానులు మంచి పనికోసం ఉపయోగించారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ…

గుంటూరు కారం- మహేష్ సూపర్ మాస్ పోస్టర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.