తండ్రికి తగ్గ తనయుడు, రియల్ సూపర్ స్టార్..మహేష్ బాబు

Superstar Mahesh Babu Birth Day Special Article

దివంగత నటుడు, టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నట వారసుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ఫిల్మ్ ‘మురారి’ నేడు రీరిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఆయన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళితో #SSMB అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన సినీ జీవితంపై తెలుగు ఫిల్మ్ నగర్ స్పెషల్ స్టోరీ..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా 1999లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. తొలి సినిమా ‘రాజకుమారుడు’ తోనే సూపర్ హిట్ అందుకున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీలో ప్రీతి జింటా కథానాయికగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా ఘనవిజయం తర్వాత మహేష్‌ను అభిమానులు ముద్దుగా ‘ప్రిన్స్’ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.

అయితే దీని తర్వాత చేసిన ‘వంశీ’, ‘యువరాజు’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో 4వ సినిమాగా వచ్చిన ‘మురారి’తో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. 2001లో విడుదలైన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి ఆయన సినీ కెరీర్‌లోనే మరపురాని చిత్రంగా నిలిచియింది. సరిగ్గా చెప్పాలంటే.. మహేష్ లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా.

ఆ తర్వాత ఒక్కడు, అర్జున్, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్‌మాన్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట, తాజాగా గుంటూరు కారం సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు మహేష్ బాబు. ఇక మధ్యలో విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీస్టారర్ మూవీ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం అనేది తెలుగులో అప్పటికి చాలాకాలం అయింది.

ఇక ఇదిలావుంటే, ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్” చిత్రంతో పాశ్చాత్య దేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా బడ్జెట్ రూ.1,000 కోట్లకు పైనే ఉంటుందని ఒక టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడికానుంది.

కాగా మహేష్ బాబు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయన పూర్తిగా ఫ్యామిలీ పర్సన్. కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మహేష్ ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు. తనయుడు గౌతమ్ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. కుమార్తె సితార ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు అడపాదడపా వాణిజ్య ప్రకటనల్లో తళుక్కుమంటోంది. దీనిద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తోంది.

మరోవైపు మహేష్ బాబు, సినిమాలే కాకుండా సేవాకార్యక్రమాలలోనూ ముందుంటుంటారు. ‘మహేష్ బాబు ఫౌండేషన్’ అనే చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఎంతోమంది పేదవారికి సహాయం అందిస్తున్నారు. గుండె జబ్బులతో బాధపడే పేద పిల్లలకు తన ట్రస్ట్ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేయిస్తున్నారు. అలాగే ప్రతి యేడాది ఎంతోమంది పిల్లలకు సొంత ఖర్చులతో చదువు చెప్పిస్తున్నారు. ఇక మహేష్ లాగే ఆయన కుమార్తె సితార ఘట్టమనేని కూడా సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండటం విశేషం.

తండ్రికి తగ్గ తనయుడిగా.. తండ్రి వారసత్వాన్ని ఘనంగా కొనసాగిస్తూ.. ముందుకు దూసుకెళ్తోన్న మహేష్ బాబు నిజమైన సూపర్ స్టార్. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, అద్భుతమైన చిత్రాలు మనకు అందించాలని, తద్వారా ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ఫిల్మ్ నగర్ తరపున మహేష్ బాబుకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.