నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు కూడా. ఇక ఈ సందర్భంగా ఫ్యాన్స్ పలువురు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రౌడీహీరో కూడా తన ఇన్ట్సా ద్వారా బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్త్ డే మహేష్ సర్ .. బిగ్ స్క్రీన్ పై మిమ్మల్ని చూడటానికి ఎక్కువ వెయిట్ చేయించకండి.. మీరు ఎప్పుడు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ పేర్కొన్నాడు. దీంతో రౌడీహీరో చేసిన స్వీట్ రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు. చిన్నప్పుడే పలు సినిమాలలో నటించాడు. తరువాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అలరించాడు. ఈఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆసినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాగా.. ఈసినిమాలో మహేష్ మేకోవర్, స్టైల్, డైలాగ్స్, ఎనర్జిటిక్ యాక్షన్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు ఎప్పటినుండో మహేష్ ను ఈ యాంగిల్ లో చూడాలనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. ఈసినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది.
మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే శ్రీలంక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తో 60శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: