ఎంబీ ఫౌండేషన్ కు బిజినెస్ మేన్ కలెక్షన్స్

mahesh babu business man collections donated to MB foundation

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బిజనెస్ మేన్. ఈసినిమా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ఆగష్ట్ 9వ తేదీన రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రీరిలీజ్ లో కూాడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. రిలీజ్ అయిన మొదటిరోజే ఈసినిమా 4 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. అయితే ఈమధ్య రీరిలీజ్ కలెక్షన్స్ ను కూడా మంచిపని కోసం వాడుతున్నారు అభిమానులు. ఈనేపథ్యంలోనే బిజినెస్ మేన్ కలెక్షన్స్ ను కూడా మహేష్ అభిమానులు మంచి పనికోసం ఉపయోగించారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ను కూడా ఈ ఫౌండేషన్ కు అందించి.. పిల్లల చదువులకు అలానే హార్ట్ ఆపరేషన్స్ కు వినియోగించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి అలానే శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఆతరువాత రాజమౌళి తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను చేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =