
ట్యాగ్ · 16 కథనాలు


మహర్షి సూపర్ ప్రీ రిలీజ్ బిజినెస్

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’

చిరు, నాగ్, వెంకీ బాటలో మహేష్ కూడా వెళతాడా?

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హై లైట్స్

'మహర్షి' ట్రైలర్ రిలీజ్

జోరుగా మహర్షి మూవీ ప్రమోషన్స్

డిఫరెంట్ లుక్స్ లో మహేష్ బాబు

మహర్షి టీజర్ రిలీజ్

మహర్షి ఫస్ట్ సింగిల్ కి టైమ్ ఫిక్స్

మహర్షి మూవీ - బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్

మహర్షి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'మహర్షి' విషయంలో మహేష్ జోస్యం నిజమైంది
మొత్తానికి మన తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. జాతీయ ఉత్తమ సినిమాగా జెర్సీ సినిమాకు అవార్డ్ దక్కింది. అంతేకాదు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇక వంశీపైడిపల్లి దరశకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి కూడా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా “మహర్షి” సినిమా అవార్డు సొంతం చేసుకుంది. దీనితో పాటు ఉత్తర కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం(మహర్షి)అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ కెటగిరీలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కు అవార్డ్ దక్కింది. ఈనేపథ్యంలో రెండు సినిమాల చిత్రబృందాలు సంబరాలు జరుపుకుంటున్నారు.
సొంత సినిమాల ఇంటి భోజనం చేస్తున్న టాప్ స్టార్స్
టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరికీ సొంత బ్యానర్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా బయట నిర్మాతలకు సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తమ అభిరుచికి అనుగుణంగా సొంత బ్యానర్లో సినిమాలు తీసుకుంటూ ఉంటారు అగ్ర హీరోలు. ఇది అనాది నుండి జరుగుతున్న ప్రాక్టీస్. హీరోలుగా కెరీర్ ప్రారంభ దశలోనే సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి సినిమాలు తీసుకుంటూ అద్భుత విజయాలను అందుకున్నారు మన హీరోలు.1944లో హీరో అయిన అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ నటి అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావులతో భాగస్వామ్యం కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు.

మహర్షి సూపర్ ప్రీ రిలీజ్ బిజినెస్
ఇంకా కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది మహర్షి సినిమా రిలీజ్ కు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై హైప్ కూడా బాగా పెంచుతున్నారు చిత్రయూనిట్. దానికి తోడు ఇటీవల విడలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగిందని సమాచారం. ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ. 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో రూ. 50 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. మరి ఏయో ఏరియాలో మహర్షి…

వంశీ ని పొగిడా.. సుకుమార్ ను ఏమనలేదు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి ఈనెల 9 న గ్రాండ్ గా విడుదలకానున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం మహేష్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగానే మహేష్ తాజాగా మీడియా తో ముచ్చటించారు. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’
స్టూడెంట్‌గా, కంపెనీ సి.ఇ.ఓ.గా, రైతుగా… ఇలా మూడు పార్శ్వాలున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అలాగే… ప్రకాష్ రాజ్, జయసుధ, జగపతిబాబు ముఖ్య భూమికలను పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని… ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలను తారా…

చిరు, నాగ్, వెంకీ బాటలో మహేష్ కూడా వెళతాడా?
మే 9, 2019… సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. ఎందుకంటే… ఆ రోజు తమ అభిమాన హీరో నటించిన ‘మహర్షి’ విడుదలయ్యే రోజు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఇటు అభిమానులతో పాటు… అటు సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే… మే 9వ తేదీకి, తెలుగు సినీ అగ్ర కథానాయకుల చిత్రాలకి విడదీయరాని బంధం ఉంది.ఎందుకంటే… ఇదే తేదిన కొందరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వేర్వేరు సంవత్సరాల్లో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హై లైట్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1వ తేదీ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. సక్సెస్ ఫుల్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు, రైటర్ శ్రీమణి, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, నటులు పోసాని, రాజీవ్ కనకాల, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

'మహర్షి' ట్రైలర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ 'మహర్షి' మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

జోరుగా మహర్షి మూవీ ప్రమోషన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన తారాగణం గా రూపొందిన మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ప్రతిష్టాత్మకంగా రూపొందింది. నిర్మాతలు మహర్షి మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరిగే 4ట్రైన్స్ ను రెంట్ కు తీసుకొని మహర్షి మూవీ పోస్టర్స్ తో కవర్ చేశారు

మహర్షి నుండి 'పదరా పదరా' సాంగ్ రీలీజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సిల్వర్ జూబ్లి సినిమా మహర్షిపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మే 9వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుసగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకూ మూడు పాటలు రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈ చిత్రంలోని 'పదరా పదరా' నాల్గవ సాంగ్ ని విడుదల చేశారు.

‘మహర్షి’లో ఎనిమిది పాటలు?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో `అల్లరి` నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా... ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ “చోటీ చోటీ బాతే”... మహేష్ ఫ్యాన్స్‌తో పాటు శ్రోతలను కూడా విశేషంగా అలరిస్తోంది.

డిఫరెంట్ లుక్స్ లో మహేష్ బాబు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ లో మహేష్ బాబు స్టూడెంట్ , బిజినెస్ మాన్, కామన్ మాన్ గా మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. పూజా హెగ్డే కధానాయిక. అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మహర్షి టీజర్ రిలీజ్
మహేష్ నటిస్తున్న సిల్వర్ జూబ్లీ సినిమా 'మహర్షి' కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో చిత్రయూనిట్ కూడా అభిమానులను ఎక్కడా నిరాశ పరచకుండా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా... ఇప్పుడు తాాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

మహర్షి ఫస్ట్ సింగిల్ కి టైమ్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అలా అభిమానులను ఉత్సాహపరిచే ఓ అప్ డేట్ ఇచ్చాడు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్.

మహర్షి మూవీ - బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరో యాక్షన్ సీన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి ఎండింగ్ కు కానీ... మార్చి ఫస్ట్ వీక్ కు కానీ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది.

మహర్షి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ముందు తెలిపినా..ఆతరువాత రిలీజ్ డేట్ వాయిదా పడిందని..ఏప్రిల్ 25వ తేదీన మహర్షి సినిమాను రిలీజ్ చేయాలన్న యోచనలో చిత్రయూనిట్ ఉందని టాక్స్ వినిపించాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చిన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు అందరూ.