మొత్తానికి మన తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. జాతీయ ఉత్తమ సినిమాగా జెర్సీ సినిమాకు అవార్డ్ దక్కింది. అంతేకాదు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇక వంశీపైడిపల్లి దరశకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి కూడా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా “మహర్షి” సినిమా అవార్డు సొంతం చేసుకుంది. దీనితో పాటు ఉత్తర కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం(మహర్షి)అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ కెటగిరీలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కు అవార్డ్ దక్కింది. ఈనేపథ్యంలో రెండు సినిమాల చిత్రబృందాలు సంబరాలు జరుపుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈవిషయంపై వంశీ పెడిపల్లి చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. మహేష్, దిల్ రాజు కాంబినేషన్‌లో మహర్షి మూవీ ప్రారంభం కావడానికి ముందు వంశీ పైడిపల్లి తీసిన ఊపిరి సినిమా తీసిన సంగతి తెలసిందే కదా. ఈసినిమాకు వంశీపైడిపల్లికి ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఆ సమయంలో వంశీ పైడిపల్లికి మహేష్ బాబు కంగ్రాట్స్ చెప్పి అభినందించారు. ఇక అప్పుడు ఊపిరి సినిమాకు ఫిలింఫేర్ అవార్డు రావడం గురించి విన్నాను కంగ్రాట్స్.. తరువాత సినిమాకు జాతీయ అవార్డు రావాలి అంటూ మెసేజ్ చేశాడు. ఇప్పుడ ఆచాట్ ను వంశీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ 2017 లో చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమైందని తెలిపాడు.
#NationalFilmAwards2019.. @urstrulyMahesh Sir… Your faith and trust in #Maharshi made it what it is today..sharing a screen grab which reflects your faith in #Maharshi way back in 2017 when I won my Filmfare for “Oopiri”… All your words came true..Thank You Sir..🙏 pic.twitter.com/ZR3zMMXDed
— Vamshi Paidipally (@directorvamshi) March 23, 2021
ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా దుబాయ్ లో చాలా రోజులు షూటింగ్ ను జరుపుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ ను కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























