మహేష్ నటిస్తున్న సిల్వర్ జూబ్లీ సినిమా ‘మహర్షి’ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో చిత్రయూనిట్ కూడా అభిమానులను ఎక్కడా నిరాశ పరచకుండా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా… ఇప్పుడు తాాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=eQraxc7QbU8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: