టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరికీ సొంత బ్యానర్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా బయట నిర్మాతలకు సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తమ అభిరుచికి అనుగుణంగా సొంత బ్యానర్లో సినిమాలు తీసుకుంటూ ఉంటారు అగ్ర హీరోలు. ఇది అనాది నుండి జరుగుతున్న ప్రాక్టీస్. హీరోలుగా కెరీర్ ప్రారంభ దశలోనే సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి సినిమాలు తీసుకుంటూ అద్భుత విజయాలను అందుకున్నారు మన హీరోలు.1944లో హీరో అయిన అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ నటి అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావులతో భాగస్వామ్యం కలిసి కొన్ని సినిమాలు నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గా, దుక్కిపాటి మధుసూదనరావు సారథ్యంలో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు అక్కినేని నాగేశ్వరావు. ఇంక ఎన్.ఏ.టి. బ్యానర్ స్థాపించి నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోను, ఇతర దర్శకుల దర్శకత్వంలోనూ నిర్మించిన ఘన విజయాల చరిత్ర తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ , రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపికృష్ణ మూవీస్ , మంచు మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ , చిరంజీవి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్, నాగార్జున అన్నపూర్ణ స్టూడియో, వెంకటేష్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సొంత చిత్రాలు తీసి తమ కెరీర్ ను అన్ని విధాలా పటిష్ట పరుచుకున్నారు. నిజానికి కష్టకాలంలో ఉన్న ఆయా హీరోలందరినీ మంచి విజయాలతో నిలబెట్టిన క్రెడిట్ వారి సొంత బ్యానర్స్ కే దక్కుతుంది.
ఇక ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే-ఈ మధ్యకాలంలో మన అగ్ర కథానాయకులు అందరూ “బ్యాక్ టూ బ్యాక్” ఓన్ ప్రొడక్షన్ సినిమాలు చేసుకోవటం ఒక యాదృచ్చిక విశేషం. ఆ వివరాలు ఏంటో చూద్దాం:
చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తరువాత ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న “సైరా” చిత్రాన్ని కూడా హోమ్ ప్రొడక్షన్ లోనే చేస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న 152 వ సినిమాలో కూడా “కొణిదెల ప్రొడక్షన్స్” భాగస్వామ్యం ఉన్నట్లుగా తెలుస్తుంది.సో… దీనితో మెగాస్టార్ చిరంజీవి వరుసగా మూడోసారి ఓన్ ప్రొడక్షన్ లో చేస్తున్నట్లు అవుతుంది.
బాలకృష్ణ:
ఎన్.బి.కె. ఫిలిమ్స్ సంస్థను స్థాపించి వరుసగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలను నిర్మించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో సీ కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. కాగా బాలయ్య తదుపరి చిత్రం ఏదవుతుందో తెలియనప్పటికీ అందులోఎన్.బి.కే. ఫిలిమ్స్ భాగస్వామ్యం ఉండవచ్చని తెలుస్తోంది.
నాగార్జున:
నాగార్జున నటిస్తున్న “మన్మధుడు-2″ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్- మనం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే దాని ఫాలో అప్ చిత్రమైన” సోగ్గాడే చిన్ని నాయనా” చిత్రాన్ని సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు.
వెంకటేష్:
వెంకటేష్ కు చిత్ర నిర్మాణంతో లేకపోయినప్పటికీ ప్రస్తుతం కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్ – నాగ చైతన్య కాంబినేషన్లో నిర్మితమవుతున్న ” వెంకీ మామ” చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అలాగే త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్ తదుపరి చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోనే జరుగుతుంది.
ప్రభాస్:
ప్రస్తుతం బాహుబలి ప్రభాస్ హీరోగా నిర్మితమవుతున్న రెండు చిత్రాలు హోమ్ ప్రొడక్షన్ అనే అనుకోవాలి. “సాహో” చిత్రాన్ని నిర్మిస్తున్న యు.వి క్రియేషన్స్, రాధాకృష్ణ దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్న గోపి కృష్ణ మూవీస్ రెండూ ప్రభాస్ కు ఓన్ బ్యానర్స్ వంటివే.
మహేష్ బాబు:
ఇక మహేష్ బాబు,రామ్ చరణ్ విషయానికి వస్తే వీళ్లు ఇద్దరూ సొంత బ్యానర్స్ లో రిపీట్ కాకపోయినప్పటికీ
ఆయా నిర్మాతలకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయటం విశేషం. మహేష్ బాబు 25 వ చిత్రం గా రూపొందిన’ మహర్షి’ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు కు మరలా వెంటనే అనిల్ రావిపూడి కాంబినేషన్ చిత్రం ఒకే అయింది. 14 రీల్స్ అధినేత అనిల్ సుంకర తో కలసి సంయుక్త నిర్మాణం చేస్తున్నారు దిల్ రాజు. ఇలా మహేష్ బాబుకు దిల్ రాజు, దిల్ రాజుకు మహేష్ బాబు రిపీట్ అవుతున్నారు.
రామ్ చరణ్:
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఓన్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ ను డెడికేట్ చేసిన రామ్ చరణ్ తను మాత్రం డివివి క్రియేషన్స్ కు వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు. వినయ విధేయ రామ,RRR తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిత్రం కూడా డీవీవీ దానయ్య కే చేస్తున్నారు రామ్ చరణ్.
ఈ విధంగా ఒకే సమయంలో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ బ్యాక్ టు బ్యాక్ సొంత సినిమాలు చేసుకోవడం ఒక యాదృచ్చిక విశేషం. ఎవ్వరూ కావాలని ప్లాన్ చేయనప్పటికీ ఇలాంటి అరుదైన సందర్భాలు అలా ఎదురవుతూ ఉంటాయి.సో… ఆల్ ద బెస్ట్ టూ ఆల్ ద టాప్ స్టార్స్.
[subscribe]
[youtube_video videoid=RzLilMmqAa0 ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: