బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం రాంపేజ్ కొనసాగుతుంది.మొదటి రోజుకు దీటుగా మూడో రోజు కూడా వసూళ్లను రాబట్టుకోవడంతో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 50కోట్లు దాటింది.ఇక ఈసినిమా నైజాం ,సీడెడ్ , గుంటూరు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.రేపటి తో కంప్లీట్ గా టార్గెట్ ను పూర్తి చేయనుంది.దాంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో వున్నాయి.గంటకి 20వేలకుపైగా టికెట్లు తెగుతున్నాయి.ఇప్పటివరకు బుక్ మై షో లో 1.5 మిలియన్లకు పైగా టికెట్ సేల్స్ జరిగాయి.వచ్చే నెల వరకు సినిమాలు ఏవి లేకపోవడంతో సూపర్ లాంగ్ రన్ ను కొనసాగించనుంది. ఫుల్ రన్ లో ఈసినిమాలో 300కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు.విక్టరీ వెంకటేష్ ,డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. దిల్ రాజు , శిరీష్ ఈసినిమాను నిర్మించారు.ఇక ఈసినిమాతో వెంకటేష్ ,అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టారు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ఎఫ్ 2,ఎఫ్ 3 సూపర్ హిట్ అవ్వగా సంక్రాంతికి వస్తున్నాం ఈరెండింటికి మించిన విజయం సాధించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: