సంక్రాంతికి వస్తున్నాం రెండో రోజు కూడా

Netflix revealed this year telugu movie releases

విక్టరీ వెంకటేష్ ,అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాం అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.సంక్రాంతి రోజు విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు ఏకంగా 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకటేష్ కు కెరీర్ బెస్ట్ అందించింది.ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉండడంతో రెండో రోజు కూడా సెన్సేషనల్ హోల్డ్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది .రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 77కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో వున్నాయి.గంటకి 20వేలకుపైగా టికెట్లు తెగుతున్నాయి.రేపటితో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. వెంకటేష్ కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల సినిమా కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రేపటి తో దాదాపు బ్రేక్ ఈవెన్ ను కూడా కంప్లీట్ చేసుకోనుంది.అటు యూఎస్ఏ లోనూ ఈసినిమా 1 మిలియన్ మార్క్ కు చేరువైంది.ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ సపోర్ట్ తో సంక్రాంతికి విన్నర్ గా నిలిచింది. ఫుల్ రన్ లో బయ్యర్లకు సంక్రాంతికి వస్తున్నాం భారీ లాభాలను తీసుకురానుంది.

ఇందులో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , శిరీష్ ఈసినిమాను నిర్మించారు.ఇక ఈసినిమాతో వెంకటేష్ ,అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టారు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 రాగ ఈ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.