కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయార్చి’. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదలవుతోంది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్పటికే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుదల మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించారు.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్.. విడాముయార్చి సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేస్తున్న ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: