మెకానిక్ రాకీ తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా లైలా.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలకాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.టీజర్ లో సోను రోల్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన విశ్వక్ తరువాత లైలా గా కనిపించాడు. ఓవరాల్ గా టీజర్ అయితే సినిమాకు హైప్ క్రియేట్ చేసింది.లియోన్ జేమ్స్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.ఫిబ్రవరి 14న విడుదలకానుంది.
ఇక విశ్వక్ ఈసినిమా తరువాత ఫంకీ లో నటించనునున్నాడు.జాతి రత్నాలు ఫేమ్ కెవి అనుదీప్ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ఫ్ ఫోర్ సినిమాస్ ఈసినిమాను నిర్మించనున్నాయి. ఈఏడాది చివర్లో విడుదలకానుంది.
ఇదిలావుంటే గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన విశ్వక్ సేన్ కి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.ఇక ఈఏడాది లైలా ,ఫంకీ లతో రానున్నాడు.మరి ఈసినిమాలు విశ్వక్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: