పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు.ఇది రెండు భాగాలుగా విడుదలకానుంది.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.కుదిరిరితే ఈనెలలోనే బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేయనున్నారు.ఇక ఈసినిమా నుండి మొదటి పాటను ఈరోజు రిలీజ్ చేశారు.మాట వినాలి అంటూ వచ్చిన ఈసాంగ్ కు పవన్ కళ్యాణ్ వోకల్స్ అందించడం విశేషం. ఈ సాంగ్ ను పెంచల్ దాస్ రచించగా కీరవాణి సంగీతం అందించారు.సాంగ్ కూడా వినడానికి బాగుంది.ఇందులో పవన్ లుక్ ఆకట్టుకుంది.తెలుగుతోపాటు తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్ విడుదలైయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరి హర వీరమల్లును సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగితా భాగం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాదాపు 100కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం ఈసినిమాను నిర్మిస్తున్నారు.మార్చి 28న హరి హర వీరమల్లు మొదటి భాగం పాన్ ఇండియా మూవీగా థియేటర్లలోకి రానుంది.దాదాపు 2 ఏళ్ళ తరువాత పవన్ ఈసినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక పవన్ ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు పూర్తి చేయాల్సివుంది.అందులో ఓజీ ఒకటి కాగా రెండోది ఉస్తాద్ భగత్ సింగ్.ఓజీని సుజీత్ తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తయింది.హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ రిలీజ్ తరువాత పవన్ ఓజీని పూర్తి చేయనున్నాడు.ఈఏడాది చివర్లో విడుదలచేయనున్నారు.ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇప్పటివరకు 20శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: