ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ ఏడాది కొత్తగా స్ట్రీమింగ్ చేయబోయే తెలుగు సినిమాలను ప్రకటించింది.నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ఈ లిస్ట్ ను అనౌన్స్ చేసింది.ఇందులో అన్ని మినిమమ్ గ్యారెంటీ సినిమాలు వున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే …పవన్ కళ్యాణ్ ,సుజీత్ ల మచ్ అవైటెడ్ మూవీ ఓజీ స్ట్రీమింగ్ హక్కులను అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా.ఈఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అలాగే నాగ చైతన్య ,సాయి పల్లవి ల తండేల్ తెలుగు తోపాటు మిగితా భాషాల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.చందు మొండేటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది.ఫిబ్రవరి 7న ఈసినిమా థియేట్రీకల్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాని హిట్ 3 కూడా నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.తెలుగు తోపాటు అన్ని భాషల్లో ఈసినిమా హక్కులను దక్కించుకుంది.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మే 1న థియేటర్లలోకి రానుంది.శైలేష్ కొలను ఈసినిమా తెరకెక్కిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే విజయ్ దేవరకొండ 12 వ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.ఈసినిమా అన్నిభాషల్లో స్ట్రీమింగ్ లో రానుంది.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.
వీటితోపాటు మాస్ రాజా రవితేజ మాస్ జాతర ,నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు హిందీ తప్ప మిగితా భాషల్లో స్ట్రీమింగ్ లోకి రానున్నాయి.అలాగే సిద్దు జొన్నలగడ్డ జాక్ ,మ్యాడ్ స్క్యోర్ ,కోర్ట్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తరువాత అన్నిభాషల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: