టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ రివ్యూ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు తాజాగా ఆయన మూవీ చూసిన అనంతరం ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “సరైన పండుగ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, చూసి ఆనందించాను… వెంకీ మామా సర్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే మై డైరెక్టర్ అనిల్ రావిపూడిని చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.. వరుసగా బ్లాక్ బస్టర్లు అందించినందుకు” అని పేర్కొన్నారు. ఇంకా హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి నటనను ప్రసంసించిన మహేష్ చిత్ర బృందానికి, నిర్మాతలకు కంగ్రాట్స్ తెలిపారు.
కాగా ఈ చిట్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పత్రాలు పోషించారు.
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ఇదే బ్యానర్ లో గ్లోబల స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కూడా జనవరి 10న రిలీజై మంచి విజయం అందుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























