సీనియర్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా నిన్న కూడా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది దాంతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 114కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80కోట్ల షేర్ కాగా ఇప్పటివరకు 74కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.ఈరోజు ఈసినిమా టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అంతేకాదు ఈవారాంతంలో భగవంత్ కేసరి లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ రన్ లో 150కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఈసినిమాతో బాలకృష్ణ వరసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.అయితే డాకు మహారాజ్ కు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం తో గట్టి పోటీ ఎదురువుతుంది.
బాబీ తెరకెక్కించిన ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్ ,ప్రగ్యా జైస్వాల్ ,ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు.తమన్ సంగీతం అందించాడు.సాయి సౌజన్య ,నాగవంశీ ఈసినిమాను నిర్మించారు.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ 2లో నటిస్తున్నాడు.బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.14 రీల్స్ ప్లస్ ఈసినిమాను నిర్మిస్తుంది.దసరాకు విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: