ఘాటి నుండి విక్రమ్ ప్రభు ఫస్ట్ లుక్, బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

the glimps of desi raju out from Ghaati

క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది బ్లాక్ బస్టర్ వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్క కు నాల్గవ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అతని ఫస్ట్ లుక్, పాత్ర గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ అతన్ని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. గ్లింప్స్‌ లో దట్టమైన అడవులు, కఠినమైన ఘాట్ ప్రాంతాల గుండా పోలీసులు విక్రమ్‌ను వెంబడిస్తున్నట్లు ప్రజెంట్ చేశారు. తరువాత అతను గూండాలతో ఇంటెన్స్ యాక్షన్ సీన్ ప్యాక్డ్ గా వున్నాయి. విక్రమ్, అనుష్క తమ బైక్‌లను పక్కపక్కనే నడుపుతూ, ఒకరినొకరు చూసి నవ్వుతూ, వారి పాత్రల మధ్య పవర్ ఫుల్ కెమిస్ట్రీని సూచిస్తూ లైటర్ రొమాంటిక్ టచ్‌తో గ్లింప్స్ ముగుస్తుంది.

గ్లింప్స్ అయితే హై-ఆక్టేన్ యాక్షన్‌ను ప్రామిస్ చేయడమే కాకుండా, ఒక అద్భుతమైన ప్రేమకథని కూడా చూపుతోంది. ఈ గ్లింప్స్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఘాటీ అద్భుతమైన కథనాన్ని, మానవత్వం, మనుగడ , ముక్తికి హామీ ఇస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విసెరల్, యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.

ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.

కాగా ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో ఏప్రిల్ 18న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.