
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 20


వీర ధీర శూర 2.. టీజర్ రిలీజ్

కోర్ట్ యూఎస్ఏ కలెక్షన్స్

కోర్ట్ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు

గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఫస్ట్ సింగిల్ వస్తోంది

కూలీ సెట్స్ నుంచి క్రేజీ పిక్స్

కోర్ట్ టీమ్‌ని అభినందించిన దిల్ రాజు

కోర్ట్‌లో నట విశ్వరూపం చూపించిన శివాజీ

కోర్ట్ సాలిడ్ స్టార్ట్

హోలీ సెలబ్రేషన్స్‌లో సంబరాల యేటిగట్టు టీమ్

సమంత నిర్మిస్తోన్న ‘శుభం’ రిలీజ్‌కి రెడీ
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం.

వీర ధీర శూర 2.. టీజర్ రిలీజ్
చియాన్ విక్రమ్, సేతుపతి, చిత్తా సినిమాలతో పాపులరైన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ తో కలిసి హెచ్.ఆర్. పిక్చర్స్, రియా శిబు నిర్మించిన వీర ధీర సూర అనే రెండు భాగాల యాక్షన్, ఫ్యామిలీ డ్రామా కోసం చేతులు కలిపారు. ఇంట్రస్టింగ్ గా ఈ చిత్రం యొక్క రెండవ భాగం మొదట మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ వీర ధీర శూర 2 టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

హిట్ 3 ఫస్ట్ సాంగ్ రానుంది
సరిపోదా శనివారం తరువాత నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.హిట్ ఫ్రాంఛైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తుండగా ఇందులో నాని, అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రీసెంట్ గా వచ్చిన టీజర్ సెన్సేషనల్ వ్యూస్ తో సినిమాపై అంచనాలను పెంచేసింది.టీజర్ లో నాని వైలెంట్ గా కనిపించాడు.

కోర్ట్ యూఎస్ఏ కలెక్షన్స్
నిన్న విడుదలైన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.తొలి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈరోజు నిన్నటి కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకోనుంది.బుకింగ్స్ అయితే సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షో లో గంటకు 7 వేలకు టికెట్లకు పైగా బుక్ అవుతూ ట్రెండింగ్ లో వుంది.మొదటి రోజు లక్షకు పైగా టికెట్లు తెగాయి.ఈరోజు తో ఈసినిమా బ్రేక్ ఈవెన్ కానుంది.దాంతో ఫుల్ రన్ లో ఊహించని లాభాలను తీసుకురానుంది.

టాప్ ట్రెండింగ్‌లో లైలా
టాలీవుడ్ 'మాస్ కా దాస్' విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో విడుదలకు ముందే మార్కెట్లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది.

రాబిన్ హుడ్ నుండి వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్
నితిన్ ,వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్.మైత్రి ఈసినిమాను నిర్మిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా చేసింది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది.ఇక ఈసినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. ఈన్యూస్ ఇంతకుముందే బయటికి వచ్చిన ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పుష్ప రిలీజ్ టైం నుండి వార్నర్ రీల్స్ చేస్తూ సినిమాపై తన ఇంట్రెస్ట్ చాటుకున్నాడు.ఇక వార్నర్ కోరిక నెరవేరింది.రాబిన్ హుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇందులో వార్నర్ రోల్ కి ఎలాంటి…

కోర్ట్ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

మోగ్లీ 2025.. రోషన్ కనకాల బర్త్ డే పోస్టర్ రిలీజ్
తొలి చిత్రం 'బబుల్ గమ్'లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఫస్ట్ సింగిల్ వస్తోంది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

కూలీ సెట్స్ నుంచి క్రేజీ పిక్స్
సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కోర్ట్.. ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. అంతకుముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కోర్ట్ టీమ్‌ని అభినందించిన దిల్ రాజు
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు
తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ గా డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమా ఈఏడాది తమిళనాడులో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు డ్రాగన్ తో వరుసగా రెండో సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో గా ప్రదీప్ ఘనత సాధించాడు.ఇంతకుముందు తన మొదటి సినిమా లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. తెలుగులో కూడా ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది.

కోర్ట్‌లో నట విశ్వరూపం చూపించిన శివాజీ
సీనియర్ నటుడు శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన తర్వాత కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. తర్వాత బిగ్ బాస్‌లో ఆయన ఎంట్రీ ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వం చూసి అనేకమంది ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయారు.

కోర్ట్ సాలిడ్ స్టార్ట్
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో నాలుగో సినిమాగా వచ్చింది కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ఈసినిమా ఈరోజే థియేటర్లలో విడుదలకాగా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. ఈరోజు హోలీ సందర్బంగా హాలిడే కావడం అలాగే బాక్సాఫీస్ వద్ద మరో సినిమాతో పోటీ లేకపోవడంతో కోర్ట్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.బుక్ మై షో లో గంటకు 8 వేలకు పైగా టికెట్స్ బుకింగ్ తో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 5 నుండి 7కోట్ల మధ్య వసూళ్లను రాబట్టుకోనుంది.

నా 25 ఏళ్ల కల కోర్ట్ తో తీరింది- యాక్టర్ శివాజీ
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన మూవీ కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ.ఇందులో హర్ష్ రోషన్,శ్రీదేవి , ప్రియదర్శి ,శివాజీ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.ఈరోజే ఈసినిమా థియేటర్లలోకి రాగ సూపర్ పాజిటీవ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.ముఖ్యంగా శివాజీ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్రంలో మంగపతి పాత్ర పోషించిన యాక్టర్ శివాజీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

హోలీ సెలబ్రేషన్స్‌లో సంబరాల యేటిగట్టు టీమ్
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG)తో తన కెరీర్‌ను న్యూ హిట్స్‌కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో సాయి దుర్ఘ తేజ్ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు.

జాక్ నుంచి త్వరలో 'కిస్' సాంగ్
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్లో ఘన సన్మానం
మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్నో ఘనతలు, పురస్కారాలు అందుకున్న ఆయన త్వరలో UK పార్లమెంట్లో మరో గొప్ప సత్కారం జరుగబోతోంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు.

ఓటీటీ లోకి వచ్చేసిన రామం రాఘవం
కమెడియన్ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన తాజా చిత్రం 'రామం రాఘవం'. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా రూపొందిన ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటించారు. ఎనర్జిటిక్ హీరో రామ్ విడుదల చేసిన గ్లింప్స్ మరియు నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకున్నాయి.