నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో నాలుగో సినిమాగా వచ్చింది కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ఈసినిమా ఈరోజే థియేటర్లలో విడుదలకాగా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. ఈరోజు హోలీ సందర్బంగా హాలిడే కావడం అలాగే బాక్సాఫీస్ వద్ద మరో సినిమాతో పోటీ లేకపోవడంతో కోర్ట్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.బుక్ మై షో లో గంటకు 8 వేలకు పైగా టికెట్స్ బుకింగ్ తో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 5 నుండి 7కోట్ల మధ్య వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాకు నాని 9కోట్ల దాక ఖర్చు పెట్టాడు.ఇదంతా నాన్ థియేట్రికల్ రూపంలో రికవరీ అయ్యింది.సో థియేట్రికల్ రన్ ద్వారా నిర్మాతలకు భారీ లాభాలు రానున్నాయి. సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు.నాని అయితే కోర్ట్ నచ్చకుంటే హిట్ 3 చూడకండి అని స్టేజ్ మీదే చెప్పేశాడు.అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి రిలీజ్ కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశాడు. ఇవ్వన్నీ ప్లస్ అయ్యాయి.
పోక్సో యాక్ట్ నేపథ్యంలో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక,వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: