ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వసంత్ మరిగంటి రాసిన ఈ కథను సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి వారిని సినిమా బండి చిత్రంతో ప్రవీణ్ కండ్రేగుల పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. త్రాలాల బ్యానర్ మీద ఈ సినిమాను మొదటి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుందని సమంత అన్నారు.
ఈ చిత్రంలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,శ్రావణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. శుభం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్‌గా ధర్మేంద్ర కాకర్లాడ్ వంటి వారు పని చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్లు త్వరలోనే రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: