మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG)తో తన కెరీర్‌ను న్యూ హిట్స్‌కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో సాయి దుర్ఘ తేజ్ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంబరాల యేటిగట్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం టీం హైదరాబాద్‌లో ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు హోలీ శుభ సందర్భంగా, మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇది మొత్తం టీం వారి ముఖాల్లో ఆనందంతో నిండినట్లు చూపిస్తుంది. SDT తన టీం ఉత్సాహపరిచేందుకు తన చేతిని పైకెత్తడం కనిపిస్తుంది. ఈ గెశ్చర్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే విడుదలైన కార్నేజ్ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సంబరాల యేటిగట్టు చుట్టూ ఉన్న బజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.
భారీ బడ్జెట్‌తో సంబరాల యేటిగట్టు సాయి దుర్గ తేజ్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో అద్భుతమైన సాంకేతిక బృందం ఉంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: