నిన్న విడుదలైన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.తొలి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈరోజు నిన్నటి కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకోనుంది.బుకింగ్స్ అయితే సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షో లో గంటకు 7 వేలకు టికెట్లకు పైగా బుక్ అవుతూ ట్రెండింగ్ లో వుంది.మొదటి రోజు లక్షకు పైగా టికెట్లు తెగాయి.ఈరోజు తో ఈసినిమా బ్రేక్ ఈవెన్ కానుంది.దాంతో ఫుల్ రన్ లో ఊహించని లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అటు ఓవర్సీస్ లోనూ అదరగొడుతుంది.యూఎస్ఏ లో ఇప్పటివరకు 400K డాలర్ వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఫుల్ రన్ లో మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.అదే జరిగితే కోర్ట్ అక్కడ కూడా ఈసినిమా భారీ లాభాలను తీసుకురానుంది.
పోక్సో యాక్ట్ నేపథ్యంలో రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, కీలక పాత్రలు పోషించారు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా ప్రముఖ హీరో నాని ఈసినిమాను నిర్మించాడు.నాని బ్యానర్ లోనే ఈసినిమా బిగెస్ట్ హిట్ గా నిలువనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: