నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రమోషనల్ కంటెంట్‌తో మార్కెట్‌లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ మౌత్ టాక్‌తో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. ప్రీమియర్స్‌తో కలుపుకొని తొలిరోజు మొత్తం 8.10 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇక ఈ సినిమాకి బుక్ మై షో లో గంటకు 8 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ జరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీనిలో భాగంగా స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ తాజాగా కోర్ట్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “కోర్ట్ స్టేట్ vs ఎ నోబడీ అద్భుతంగా ఉంది. ఈ కోర్టు రూమ్ డ్రామాని తెరకెక్కించడానికి టీమ్ చాలా నిజాయితీగల ప్రయత్నం చేసింది. దర్శకుడు రామ్ జగదీష్ ఈ కథను చక్కగా రాసి, తీశారు. అలాగే నటీనటులు అందరూ బాగా నటించారు. ఇలాంటి కంటెంట్‌కు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చినందుకు నానికి నా అభినందనలు. మొత్తం బృందానికి హృదయపూర్వక అభినందనలు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా కోర్ట్ మూవీని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “నిన్న కోర్ట్ సినిమా చూశాను. ఎక్స్‌ట్రాడిషియరీ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తీశాను. రామ్ జగదీష్ తొలిసారిగా నటించారు. ప్రశాంతి మరియు నానిని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా తీయడానికి నిర్మాతలుగా వారు ధైర్యంగా అడుగు పెట్టారు. సినిమాలోని ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు, ముఖ్యంగా శివాజీ తమ వంతు కృషి చేశారు.” అని పేర్కొన్నారు.
కాగా ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌లో నాలుగో సినిమాగా రూపొందిన కోర్ట్ పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: