తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ గా డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమా ఈఏడాది తమిళనాడులో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు డ్రాగన్ తో వరుసగా రెండో సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో గా ప్రదీప్ ఘనత సాధించాడు.ఇంతకుముందు తన మొదటి సినిమా లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. తెలుగులో కూడా ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక డ్రాగన్ తరువాత ప్రదీప్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి.విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలచేయాలని చూస్తున్నారు.ఇది కూడా హిట్ అయితే ప్రదీప్ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈసినిమాను నిర్మిస్తుంది.
ఈసినిమాతో పాటు ప్రదీప్ , కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు ఈడైరెక్టర్ సుధా కొంగర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.కోలీవుడ్ లో ఈ సంస్థకు రెండో సినిమా.ఇక ఈసినిమా కోసం ఇద్దరు హీరోయిన్ల ను తీసుకున్నారు.అందులో ఒకరు ప్రేమలు ఫేమ్ మామితా బైజు కాగా మరొకరు అను ఇమాన్యుయెల్.ఇది కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గానే రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: