కమెడియన్ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రామం రాఘవం’. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా రూపొందిన ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటించారు. ఎనర్జిటిక్ హీరో రామ్ విడుదల చేసిన గ్లింప్స్ మరియు నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిఫరెంట్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమా బావుందని టాక్ వచ్చినా ఆడియెన్స్ ని థియేటర్ల వైపుకి రాబట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది.
ఈ క్రమంలో తాజాగా రామం రాఘవం ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ వేదికగా నేటినుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని పొందండి.
ఈ సినిమాలో సముద్రఖని, ధన్‌రాజ్, మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకు శివప్రసాద్ యానాల కథ అందించాడు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వి పొలవరపు నిర్మించారు.
కథ:-
రామం (సముద్రఖని) నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి. భార్య కమల (వినోదిని), ఏకైక కుమారుడు రాఘవ (ధనరాజ్)తో కలిసి జీవిస్తుంటాడు. కొడుకుపై ఇష్టంతో ఈ దంపతులు చిన్నప్పటినుంచీ రాఘవను అల్లారు ముద్దుగా పెంచుతారు. దీంతో అతడు చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. మరోవైపు తండ్రి నిజాయితీని చేతకానితనంగా భావిస్తుంటాడు.
జీవితంలో స్థిరపడాలని తండ్రి పదేపదే పోరుతుండటంతో స్నేహితుడు అంజి (సత్య)తో కలిసి ఫుడ్ కోర్ట్ పెడతానంటూ తండ్రి దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు. అయితే ఆ డబ్బుని బిజినెస్ కోసం ఉపయోగించకుండా క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి మొత్తం పోగొట్టుకుంటాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిరోజులు పెట్రోల్ బంకులో పని చేస్తాడు.
కానీ తప్పుడు పద్ధతులకు అలవాటుపడిన రాఘవ డబ్బు కోసం అక్కడా ఫ్రాడ్ చేయడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతాడు. గత్యంతరం లేని స్థితిలో చివరకు తండ్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తాడు. కొడుకు రోజు రోజుకు దిగజారిపోతున్నాడని గుర్తించినా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు రాఘవ తల్లిదండ్రులు.
అయితే ఏం చేసినా ఆర్ధిక కష్టాలనుంచి బయటపడలేకపోతున్న రాఘవ ఏకంగా తండ్రినే చంపడానికి దేవా (హరీశ్ ఉత్తమన్)తో కలిసి ప్లాన్ చేస్తాడు. ఈ అమానుష చర్యకి పథకం వేసిన రాఘవ దానిని అమలు చేయగలిగాడా? తండ్రినే హతమార్చాలని చూస్తున్న రాఘవ కుట్రకు దేవా సహకరించాడా? రాఘవలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదా? చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: