టాప్‌ ట్రెండింగ్‌లో లైలా

Vishwak Sen's Laila is Now Trending at 2 in India on OTT

టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్‌ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో విడుదలకు ముందే మార్కెట్‌లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించడం విశేషం. సోను మోడల్, లైలా అనే రెండు పాత్రల్లో విశ్వక్ తనదైన నటనను ప్రదర్శించాడు. కానీ, భారీ అంచనాల మధ్య విడుదలైన లైలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. విశ్వక్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డా, స్టోరీలో బలం, కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్‌ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో లైలా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. లైలా దేశవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచి ట్రెండింగ్‌లో ఉంది. ఈ మేరకు హీరో విశ్వక్ సేన్ ఎక్స్ వేదికగా దీనిని పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహో గారపాటి బరి బడ్జెట్‌తో నిర్మించారు.

లైలా కథ ఏంటంటే..?

కథానాయకుడు సోనూ మోడ‌ల్ (విశ్వ‌క్‌సేన్‌) ఓ బ్యూటీషియ‌న్‌. హైదరాబాద్ పాతబ‌స్తీలో సొంతంగా ఒక బ్యూటీపార్ల‌ర్ రన్ చేస్తుంటాడు. పనిమంతుడు కావడంతో చాలామంది అమ్మాయిలు అతనితో మేక‌ప్ వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక తన పార్ల‌ర్‌కి వ‌చ్చే ఆడవాళ్ళని అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుంటాడు సోనూ. స్వతహాగా మంచివాడు కాబట్టి వారిలో ఎవరికైనా ఏదయినా కష్టమో.. సహాయమో కావాల్సివచ్చినప్పుడు ఆదుకొంటుంటాడు.

ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చే ఒక మహిళ క‌ష్టంలో ఉందని తెలుసుకుని ఆర్థిక స‌హాయం చేసి, ఆదుకొంటాడు. అయితే అనూహ్యంగా ఆమె వ‌ల్లే క‌ల్తీ నూనెల స్కామ్‌లో ఇరుక్కొంటాడు. ఒక వేడుకలో ఈ క‌ల్తీ నూనెతో చేసిన విందు ఆరగించి అనేకమంది ఆసుప‌త్రి పాలవుతారు. వారిలో స్థానిక ఎమ్మెల్యే కూడా ఉంటాడు. దీంతో ఆయన అనుచరులు సోనుపై పగబడతారు.

ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే బారినుంచి త‌ప్పించుకోవ‌డానికి సోనూ ‘లైలా’ అనే అమ్మాయిగా వేషం మారుస్తాడు. అయితే ఆ త‌రువాత ఏం జరిగింది? తనకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన కల్తీ నూనె స్కామ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టగలిగాడా? లైలాగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? కథానాయిక (ఆకాంక్ష శర్మ)తో తన లవ్ ఏమైంది? చివరికి ఏమయింది? అనేది మిగిలిన క‌థ‌.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.