సరిపోదా శనివారం తరువాత నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.హిట్ ఫ్రాంఛైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తుండగా ఇందులో నాని, అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రీసెంట్ గా వచ్చిన టీజర్ సెన్సేషనల్ వ్యూస్ తో సినిమాపై అంచనాలను పెంచేసింది.టీజర్ లో నాని వైలెంట్ గా కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి మొదటి సాంగ్ రానుంది.వచ్చే వారంలో ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ వోకల్స్ అందించిన ఈరొమాంటిక్ సాంగ్ చార్ట్ బస్టర్ కానుందని టాక్. శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తుండగా మే 1న ఈసినిమా విడుదలకానుంది.
ఇక నాని ప్రస్తుతం కోర్ట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.తన బ్యానర్ లో రూపొందిన సినిమా కావడంతో రిలీజ్ కు ముందు సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు.అంతేకాదు నాని ఈసినిమాను బలంగా నమ్మాడు.చివరికి తన నమ్మకం నిజమైంది.నిన్న విడుదలైన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్ తో ఎక్స్ట్రార్డినరీ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: