నితిన్ ,వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్.మైత్రి ఈసినిమాను నిర్మిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా చేసింది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది.ఇక ఈసినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. ఈన్యూస్ ఇంతకుముందే బయటికి వచ్చిన ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పుష్ప రిలీజ్ టైం నుండి వార్నర్ రీల్స్ చేస్తూ సినిమాపై తన ఇంట్రెస్ట్ చాటుకున్నాడు.ఇక వార్నర్ కోరిక నెరవేరింది.రాబిన్ హుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇందులో వార్నర్ రోల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వార్నర్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనున్నాడు.వచ్చే వారం లో వార్నర్ హైదరాబాద్ వచ్చి రాబిన్ హుడ్ ప్రమోషన్స్ కూడా చేయనున్నాడు.ఇప్పటివరకు రిలీజైన రాబిన్ హుడ్ ప్రమోషనల్ కంటెంట్ అయితే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్ రావాల్సివుంది. వచ్చే వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈనెల 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఈసినిమా విజయం నితిన్ కు తప్పినసరి కానుంది.ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతకుముందు నితిన్ -వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు రాబిన్ హుడ్ తో మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. నితిన్ అయితే సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ వున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: