చియాన్ విక్రమ్, సేతుపతి, చిత్తా సినిమాలతో పాపులరైన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ తో కలిసి హెచ్.ఆర్. పిక్చర్స్, రియా శిబు నిర్మించిన వీర ధీర సూర అనే రెండు భాగాల యాక్షన్, ఫ్యామిలీ డ్రామా కోసం చేతులు కలిపారు. ఇంట్రస్టింగ్ గా ఈ చిత్రం యొక్క రెండవ భాగం మొదట మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ వీర ధీర శూర 2 టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చూస్తుంటే.. దీనిని విలేజ్ యాక్షన్ స్పెక్టాకిల్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. విక్రమ్ తన భార్య (దుషార విజయన్) కుమార్తెతో హార్ట్ ఫుల్ మూమెంట్స్ పంచుకునే ఫ్యామిలీగా ప్రజెంట్ చేస్తూ టీజర్ బిగెన్ అవుతుంది. ఒక క్రైమ్ లోకల్ ఫెస్టివల్ కు అంతరాయం కలిగించినప్పుడు ప్రశాంతత చెదిరిపోతుంది. విక్రమ్ ను ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. ఈ టీజర్ విక్రమ్ గతాన్ని కూడా పరిచయం చేస్తుంది.
ఇందులో SJ సూర్యను మానిప్యులేటివ్ పోలీస్ పాత్రలో, సూరజ్ వెంజరమూడును టెర్రిఫిక్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రజెంట్ చేశారు. విక్రమ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ గా, రివెంజ్ తీర్చుకునే ఇంటెన్స్ పర్శన్ గా రెండు కోణాల్లో ఆదరగొట్టారు. SJ సూర్య, సూరజ్ వెంజరమూడు పెర్ఫార్మెన్స్ కట్టుకున్నాయి.
S.U. అరుణ్ కుమార్ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. థ్రిల్లింగ్ యాక్షన్, ఇంటెన్స్ డ్రామా బ్లెండ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ ఎక్సయిటింగ్ గా వుంది. తేని ఈశ్వర్ ISC సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తుంది. G.V. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ విజువల్స్ ని మరింత ఎలివేట్ చేసింది. టీజర్ నిస్సందేహంగా ‘వీర ధీర సూర’ కోసం భారీ అంచనాలను రేకెత్తించింది. కాగా ఎన్.వి.ఆర్ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకోగా, నైజాం రిలీజ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జరుగుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: