కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 170

Pushpa Director Sukumar Daughter Sukriti Veni Wins Dada Saheb Phalke Award
సినిమా వార్తలు

సుకుమార్‌ కుమార్తెకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

జీనియ‌స్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, శ్రీ‌మ‌తి త‌బితా సుకుమార్ దంప‌తుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం వ‌రించింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో ఉత్త‌మ‌న‌ట‌న‌కు గాను ఈ అవార్డును అంద‌జేశారు. మంగ‌ళ‌వారం ఢీల్లిలో జ‌రిగిన అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును అంద‌జేశారు. కాగా సుకృతి వేణి ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ హైద‌రాబాద్‌లో గ్రేడ్ 8 అభ్య‌సిస్తోంది. ఆమె న‌టించిన ఈ చిత్రం గ‌తంలో కూడా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. అలాగే ఈ చిత్రం ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Telugu Movie Director Change
షూటింగ్ అప్‌డేట్

హరిహర వీరమల్లు మిగిలిన షూటింగ్ ఆ దర్శకుడి చేతిలో

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Allari Naresh Reveals Interesting Facts About Aa Okkati Adakku Movie
సినిమా వార్తలు

ఆ ఒక్కటీ అడక్కు.. టైటిల్ ఎందుకు పెట్టామంటే?

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో హీరో అల్లరి నరేష్ విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
satyadev krishnamma movie trailer out now
ట్రైలర్ & టీజర్

కృష్ణమ్మ ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా కృష్ణమ్మ. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయ్యింది. మే 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మూవీ ప్రమోషన్స్‌ లో స్పీడు పెంచింది.

TFN Adminవాట్సాప్
kalki 2898 ad movie east godavari release rights update
సినిమా వార్తలు

కల్కి 2898AD ఈస్ట్ గోదావరి రిలీజ్ హక్కుల అప్ డేట్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. దాని తరువాత పలు గ్లింప్స్, వీడియోలు రిలీజ్ చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
harihara veeramallu movie teaser out now
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా. క్రిష్ దర్శకత్వంలో మొగలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది.ఈసినిమా రెండేళ్ల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. దీనికి కారణాలు ఒకటని చెప్పలేం.. కొన్ని రోజులు పవన్ రాజకీయలతో బిజీగా ఉంటే..కొన్ని రోజులు వేరే సినిమాలతో బిజీగా ఉండటం. ఇలా పలు కారణాల వల్ల సినిమా పెండింగ్ లోనే ఉంది. ఇప్పటివరకూ ఈసినిమా చాలా వరకూ షూటింగి ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
pushpa 2 movie first single pushpa pushpa full song out now
సాంగ్

పుష్ప 2 ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని.. సోషల్ మీడియాలో నంబర్ 1 స్థానంలో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచి.. సెన్సేషనల్‌ రికార్డు క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
pushpa 2 shooting update
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 షూటింగ్ అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేపు రిలీజ్ కానున్న పుష్ప 2 ఫస్ట్ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పార్ట్ 1 ఆల్బమ్ చార్ట్ బాస్టర్ కావడం తో పుష్ప 2 ఆడియో ఫై భారీ అంచనాలు వున్నాయి.రేపు సాయంత్రం 5:04గంటలకు ఈ ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Director Trinadha Rao Nakkina's Father Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడికి పితృవియోగం

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. దీంతో డైరెక్టర్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు త్రినాధరావు నక్కిన తండ్రి మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Venakatesh will participate in the election campaign
సినిమా వార్తలు

ఎన్నికల ప్రచారంలో వెంకటేష్

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.తెలంగాణ లో మే 13న లోక్ సభ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఖమ్మం నుండి వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ నుండి బరిలో వున్నారు దాంతో వెంకటేష్ వచ్చే నెల 7న రఘురాం రెడ్డికి మద్దుతుగా ప్రచారం చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
The family star trending at first place on Prime Video
ఓటీటీ

ట్రెండింగ్ లో ది ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ -పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ది ఫ్యామిలీ స్టార్ ప్రస్తుతం ఓటిటి లో ట్రెండింగ్ లో మొదటి స్థానం లో కొనసాగుతుంది. గత వారం ఈసినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి రాగ సాలిడ్ వ్యూయర్ షిప్ తో మొదటి స్థానంలో వుంది.ఇక ఈనెల 5న ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
surprise update will come from prabhas kalki 2898 ad movie
సినిమా వార్తలు

కల్కి 2898ఏడీ టీమ్ సర్ ప్రైజ్ ప్లాన్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరోవైపు మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈసినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Venkatesh and Naga Chaitanya Gets Invitation For The Directors Day Celebrations
సినిమా వార్తలు

డైరెక్టర్స్ డే.. వెంకటేష్‌, నాగచైతన్యలకు ఆహ్వానం

మే 4న తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ డే జ‌రుపుకోనుంది. టాలీవుడ్ దివంగత దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు దాసరి నారాయణరావు జన్మదినం (మే 4) సందర్భంగా.. ప్రతి ఏటా దర్శకుల దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక‌ కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు అంద‌రికి ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విక్టరీ వెంకటేష్ మరియు యువసామ్రాట్ నాగచైతన్య అక్కినేనిలకు టీఎఫ్‌డీఏ ఆహ్వానం అందించింది.

Srikanth Mవాట్సాప్
hari hara veera mallu movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో పడిపోయిన సంగతి తెలిసిందే కదా. అయితే మేకర్స్ మాత్రం పవర్ స్టార్ లేని పోర్షన్స్ మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటున్నారు. అందులో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమా మాత్రం గత రెండేళ్లుగా ప్రేక్షకుల ముందుకు రాకుండా ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
vijay devarakonda family star movie got super response in OTT
ఓటీటీ

ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీస్టార్

ఒక్కోసారి ఎంతో ఎక్స్ పేక్టేషన్స్ తో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అయితే కొన్ని సినిమాలు థియేటరల్లో ఫెయిల్ అయినా కొంతకాలం తరువాత ఆడియన్స్ కు ఎక్కుతుంటాయి. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి వస్తుంది ఫ్యామిలీ స్టార్ సినిమా. పరుశురాం దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈసినిమా ఏప్రిల్5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే సొంతం చేసుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Ranveer Singh and Devi Sri Prasad Dances To Allu Arjun's Pushpa Song
సాంగ్

పుష్ప పాటకు స్టెప్పులేసిన దేవిశ్రీ, ర‌ణ్‌వీర్ సింగ్.. వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీతో ఒక్కసారిగా బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇక ఈ చిత్రంలోని నటనకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం కైవసం చేసుకున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్నారు. ఆయన అందించిన పాటలు ఈ మూవీ స‌క్సెస్‌లో కీ రోల్ పోషించగా, అన్ని భాషల సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
allari naresh aa okkati adakku movie censor completes
సినిమా వార్తలు

ఆ ఒక్కటీ అడక్కు సెన్సార్ కంప్లీట్-రన్ టైమ్ లాక్

మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. చాలా రోజుల తరువాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ritu varma starts her dubbing for swag movie
సినిమా వార్తలు

స్వాగ్ డబ్బింగ్ మొదలుపెట్టిన రీతూవర్మ

వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది సామజవరగమన సినిమాతో అలరించగా ఈఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈ జోష్ తోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు చేతిలో పలు సినిమాలు ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఈసినిమా వస్తుంది.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
naga chaitanya thandel movie digital rights sold for huge price
ఓటీటీ

తండేల్- భారీ ధరకు డిజిటల్ రైట్స్

నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Priyadarshi stars in three films as a main lead
సినిమా వార్తలు

హీరోగా బిజీ అవుతున్న కమెడియన్

పెళ్లి చూపులతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రియదర్శి ఇప్పుడు హీరోగా బిజీ అవుతున్నాడు. నిజానికి మల్లేశం తో సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఆ తరువాత అలాగే కంటిన్యూ కాలేకపోయాడు. ఇక రీసెంట్ గా ఓం భీమ్ బుష్ లో అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లలో ఓ హీరోగా కనిపించాడు.ఇక ఇప్పుడు ప్రియదర్శి సోలో హీరోగా ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేశాడు.

TFN Adminవాట్సాప్

షేర్