హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్

harihara veeramallu movie teaser out now

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా. క్రిష్ దర్శకత్వంలో మొగలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది.ఈసినిమా రెండేళ్ల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. దీనికి కారణాలు ఒకటని చెప్పలేం.. కొన్ని రోజులు పవన్ రాజకీయలతో బిజీగా ఉంటే..కొన్ని రోజులు వేరే సినిమాలతో బిజీగా ఉండటం. ఇలా పలు కారణాల వల్ల సినిమా పెండింగ్ లోనే ఉంది. ఇప్పటివరకూ ఈసినిమా చాలా వరకూ షూటింగి ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత రెండు రోజులుగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈసినిమా టీజర్ కోసం. మే 2వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సూపర్ గా ఉంది.

కాగాఈసినిమాలో పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.