టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల స్టార్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారా ? అనే టాపిక్ తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. రియల్ పాలిటిక్స్ లోకి కాకుండా సమంత రీల్ పాలిటిక్స్ లోకి రానున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఒక మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నూతన దర్శకుడు ఢిల్లీ ప్రసాద్ దీన దయాళ్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి హీరోగా పొలిటికల్ ఫాంటసీ తుగ్లక్ దర్బార్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో కథానాయికగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంతను సంప్రదించారని సమాచారం. భారీ బడ్జెట్ తెలుగు మూవీ సైరా నరసింహా రెడ్డి మూవీ లో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. తుగ్లక్ దర్బార్
మూవీ ని తెలుగు లో కూడా రిలీజ్ చేయాలని నిర్మాత లలిత్ కుమార్ ప్లాన్. ప్రస్తుతం సమంత, విజయ్ సేతుపతి కి జంటగా సూపర్ డీలక్స్ తమిళ మూవీ లో నటిస్తున్నారు. తుగ్లక్ దర్బార్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?లేదా ? వేచిచూడాల్సిందే.
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: