
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 51


కన్నడ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాలయ్య?

`భారతీయుడు 2` చిత్రం కోసం కాజల్ న్యూ లుక్

మజిలీ సెకండ్ లుక్ రిలీజ్- రిలీజ్ డేట్ ఖరారు

అదృశ్యం ట్రైలర్ లాంచ్

ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?

మెహరీన్ కు మరోసారి కలిసొచ్చారు

బన్నీ-త్రివిక్రమ్ చిత్రంలో విలన్‌గా `థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ` పృథ్వీ?
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ హాస్యనటుడు `థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ` పృథ్వీ కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి…

కన్నడ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాలయ్య?
నటసింహ నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రల్లో కనిపించిన సందర్భాలు అరుదనే చెప్పాలి. `త్రి మూర్తులు` (1987), `ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?` (2012) చిత్రాల్లో ఆయన స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. మళ్ళీ...చాన్నాళ్ళ తరువాత ఓ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారట బాలయ్య. అయితే... ఈ సారి తెలుగు చిత్రంలో కాదు.. ఓ కన్నడ చిత్రంలో నటించేందుకు ఈ నందమూరి అందగాడు సిద్ధమవుతున్నారట.

`సాహో` టీమ్‌కి శ్రద్ధా కపూర్ `స్వీట్` సర్ ప్రైజ్
`ఆషిఖీ 2` చిత్రంతో యావత్ భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఆ తరువాత `ఏక్ విలన్`, `ఏబీసీడీ 2`, `బాఘీ`, `స్త్రీ` తదితర చిత్రాలతో హిందీనాట నటిగా తనదైన ముద్ర వేసింది. ఇదిలా ఉంటే... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం `సాహో`లో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధ... పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుంది.

అనుష్క ‘అరుంధతి’కి 10 ఏళ్ళు
తెలుగు తెరపై పలు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు సందడి చేశాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పరంగా సంచలనం సృష్టించాయి. ఆ చిత్రాలలో అనుష్క ద్విపాత్రాభినయంలో రూపొందిన ‘అరుంధతి’ ఒకటి. డార్క్ ఫాంటసీ హారర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ సినిమాని మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించగా... శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ జనరంజకంగా తెరకెక్కించారు. గద్వాల్ యువరాణి అరుంధతిగా, జేజమ్మగా రెండు విభిన్న పాత్రల్లో అనుష్క నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. అలాగే... `వదల బొమ్మాళి వదలా` అంటూ…

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫస్ట్ లుక్ రిలీజ్
స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా..చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆయితే కాస్త డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. మీ పందెం కోళ్లను ఎవరు మాయం చేశారో,మీ గాలిపటాల్ని తెంపేసిందెవరో మేము కనుక్కుంటాము.మీరు బొబ్బట్లు తిని పండగ చేస్కోండి అంటూ కామెడీగా చెబుతూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

`భారతీయుడు 2` చిత్రం కోసం కాజల్ న్యూ లుక్
తెలుగు, తమిళ భాషల్లో పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి... సంచలన విజయాలను అందుకుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో మెగా బడ్జెట్ మూవీలో నటిస్తోంది. అదే... `భారతీయుడు 2`. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన `భారతీయుడు` (1996)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది కాజల్. అంతేకాదు... ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుందట. పాత్ర రీత్యా... పడుచు అమ్మాయిగానూ, వయసు మళ్ళిన స్త్రీగానూ కాజల్ కనిపించనుందట. `వయసు మళ్ళిన స్త్రీ`…

మజిలీ సెకండ్ లుక్ రిలీజ్- రిలీజ్ డేట్ ఖరారు
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మజిలీ. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లో సమంత-నాగచైతన్య ఉండగా..ఇప్పుడు దివ్యంశ కౌశిక్ - నాగ చైతన్య సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. దానితో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.

అదృశ్యం ట్రైలర్ లాంచ్
వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవిప్రకాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హారర్, థ్రిల్లర్, కామెడి, ప్రధానాంశముగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ను శనివారం ఫిల్మిఛాంబర్లో హీరో జాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో... మ్యూజిక్ డైరెక్టర్ ఆల్డ్రిన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొదటి చిత్రం. బేసిక్గా నేను తెలుగువాడిని కాకపోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. శ్రవంతి మూవీస్కి వర్క్ చేశాను. నేను చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాను. తమిళ్లో దాదాపుగా 7 చిత్రాలకు సంగీతాన్ని అందించాను. ఈ సంవత్సరం…

ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘సమరసింహారెడ్డి’కి 20 ఏళ్ళు
తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయే సినిమాలలో... నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సమరసింహారెడ్డి’ ఒకటి. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో... కొన్నేళ్ళ పాటు తెలుగు సినిమా ఫ్యాక్షన్ బాట పట్టింది. మరికొన్ని ఘనవిజయాలనూ మూటగట్టుకుంది. ఇక ‘సమరసింహారెడ్డి’ విషయానికొస్తే... నందమూరి బాలకృష్ణలోని నటుడ్ని కొత్తగా ఆవిష్కరించిన చిత్రమిది. నవరసాలను అద్భుతంగా పలికించి... అభిమానుల చేతే కాదు... సగటు ప్రేక్షకుల నుంచి కూడా జేజేలు అందుకున్నాడు. సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో…

ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?
టాలీవుడ్‌లో `షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్`... అదే `ప్లే బాయ్` క్యారెక్టర్‌లతో సందడి చేస్తున్న కథానాయకుల సంఖ్య పెరుగుతోందా? దీనికి సమాధానంగా అవుననే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో 18 ఏళ్ళ క్రితం `ప్రేమతో...రా!` అంటూ విక్టరీ వెంకటేష్ ప్లే బాయ్ గా అలరిస్తే... 8 ఏళ్ళ క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `ఆరెంజ్`తో షార్ట్ టర్మ్ లవ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మ్యూజికల్ గా ఈ రెండు సినిమాలూ మెప్పించాయి. ఇక వర్తమానంలోకి వస్తే... అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న `Mr. మజ్ను` కూడా ఓ షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్ కథే. ఇప్పుడు ఈ హీరోల బాటలోనే... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కూడా…

మెహరీన్ కు మరోసారి కలిసొచ్చారు
కెరీర్ ఆరంభంలో వరుసగా మూడు విజయాలను అందుకుని `హ్యాట్రిక్ హీరోయిన్` అనిపించుకుంది... పంజాబీ జాబిలి మెహరీన్. `కృష్ణగాడి వీరప్రేమగాథ`, `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో... సంక్రాంతి కానుకగా శనివారం విడుదలైన `ఎఫ్ 2` హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా... వసూళ్ళ పరంగానూ మెప్పిస్తోంది. దీంతో... మెహరీన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసినట్లే. కేవలం సక్సెస్ మాత్రమే కాదు... నటిగానూ మరోసారి తన ప్రతిభను చాటుకుంది ఈ పంజాబీ జాబిలి. `హనీ ఈజ్ ద బెస్ట్`…

సంక్రాంతి సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్
ఈ సంక్రాంతికి పలు సినిమాలే బరిలో దిగాాయి. జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 10 వ తేదీన పేట, జనవరి 11వ తేదీన వినయ విధేయ రామ, జనవరి 12 ఎఫ్2 సినిమాలు రిలీజయ్యాయి. ఒక్కొక్క జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలు ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరి ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.