
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 25


'బంగార్రాజు' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

రవితేజ లేటెస్ట్ సెల్ఫీ

"మెలోడిఎస్ మూమెంట్ విత్ సునీత" ఈవెంట్ డేట్

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

'అంటే సుందరానికి' టైమ్ వచ్చింది..!

అజిత్ 'వాలిమై' ట్రైలర్ రిలీజ్

'లైగర్' BTS స్టిల్స్ రిలీజ్..!

క్యూట్ బేబీ సితార

థియేటర్ కు బురఖా లో సాయి పల్లవి

"యశోద" మూవీ లో సమంత రోల్

మైత్రీ చేతికి సుధీర్ బాబు సినిమా..!

ఇండస్ట్రీ లో ప్రతీ హీరోను గౌరవిస్తా - శ్రీవిష్ణు

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో విజయ్-వంశీ మూవీ

కేరళలో రామ్ చరణ్ మేనియా

'సామ్' గురించి 'చరణ్' మూడు మాటల్లో

లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్

'భోళా శంకర్'.. చిరు న్యూ ఇయర్ సర్ ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత మాత్రం ఫుల్ బిజీ అయిపోయారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన చిరు అది సూపర్ హిట్ అవడంతో వెంటనే సైరా తీయగా అది కూడా మంచి హిట్ నే అందించింది. ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చిరు నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది ఈ చిత్రం.

'బంగార్రాజు' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
కింగ్ నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా బంగార్రాజు. ఇక వీరిద్దరి కాంబినేషన్ ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూడాలా అని అక్కినేని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకుతగ్గట్టే బంగార్రాజు కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడానికే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి బరిలోకి దిగనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నా దీనిపై మాత్రం ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అయితే రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. మరోవైపు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే…

రవితేజ లేటెస్ట్ సెల్ఫీ
ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి“మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో డింపుల్ హాయతి , మీనాక్షి చౌదరి కథానాయికలు కాగా యాక్షన్ కింగ్ అర్జున్ , సచిన్ ఖేడేకర్ , ముఖేశ్ రుషి , ఉన్ని ముకుందన్ , రావు రమేశ్, మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్యమైన పాత్ర లలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

"మెలోడిఎస్ మూమెంట్ విత్ సునీత" ఈవెంట్ డేట్
సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత చిన్న వయసు లోనే సంగీత శిక్షణ తీసుకుని పలు మ్యూజిక్ కాంపిటీషన్స్ లో పాల్గొని అవార్డ్స్ , ప్రశంసలు అందుకున్నారు. 17 సంవత్సరాల వయసు లో ప్లే బ్యాక్ సింగర్ గా సునీత “గులాబి ” మూవీ లో శశి ప్రీతమ్ స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన “ఈ వేళలో నీవు ” సాంగ్ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్…

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. మరి పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో ను ఎలా ఎలివేట్ చేస్తాడో మనకు తెలిసిందే. అందుకే పూరీతో సినిమా తీయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. ఆ మధ్య కాస్త రొటీన్ కథలతో కాస్త వెనక్కి తగ్గాడు కానీ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు. పూరీ లాంటి డైరెక్టర్ విజయ్ లాంటి హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాపై కూడా అంతే ఆసక్తి ఉంది అందరికీ. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం…

'అంటే సుందరానికి' టైమ్ వచ్చింది..!
యంగ్ హీరో నాని మాత్రం ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ముందు టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని... ఈనెల 24న శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇదే జోష్ తో వెంటనే అంటే సుందరానికి సినిమాను స్టార్ట్ చేసేశాడు. బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఈసినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను స్టార్ట్ చేసినా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతవరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తికాగా.. శ్యామ్ సింగ రాయ్ సినిమా…

అజిత్ 'వాలిమై' ట్రైలర్ రిలీజ్
తమిళ్ హీరో అజిత్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటినుండో ఆయన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూ వస్తూనే ఉన్నాయి. అందుకే ఇక్కడ కూడా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అజిత్ నుండి వాలిమై సినిమా వస్తుండగా.. ఈసినిమా కోసం ఎంతోమంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగులో ‘వాలిమై’ చిత్రాన్ని ‘బలం’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. హెచ్. వినోత్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను చూస్తుంటేనే అర్థమవుతుంది.. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన…

"సర్కారు వారి పాట "మూవీ అప్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'లైగర్' BTS స్టిల్స్ రిలీజ్..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ లైగర్. ఇక ఇన్ని రోజులు షూటింగ్ పనులతో బిజీగా ఉండి సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మాత్రం వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తుంది. ఒకేసారి మూడు అప్ డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనిలో భాగంగానే నిన్న బిగ్ అనౌన్స్ మెంట్ ఫస్ట్ గ్లింప్స్ అప్ డేట్ కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక చెప్పినట్లుగానే ఈరోజు ఈ సినిమా నుంచి బెస్ట్ స్టిల్ రిలీజ్ చేసింది యూనిట్. విజయ్ దేవరకొండ కెమెరా పట్టుకొని… ఉన్న స్టిల్ తో పాటు పూరి జగన్నాథ్ చెప్పే కథ వింటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నిధి అగర్వాల్ ఫేవరేట్ సాంగ్ "లాలా భీమ్లా "
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హీరో ”, “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ఇస్మార్ట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిధి టాలీవుడ్ , కోలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మారారు. కోలీవుడ్ స్టార్ హీరోస్ నిధి తో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కోలీవుడ్ లో నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి.

క్యూట్ బేబీ సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార చిన్నప్పటినుండి చాలా యాక్టివ్ గానే ఉంటున్న విషయం తెలిసిందే. డ్యాన్స్ టాలెంట్ ఉన్న సితార పలు డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడైతే సితారనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ స్టా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. రీసెంట్ గా కొరియో గ్రాఫర్ అనీ మాస్టర్ డ్యాన్స్ కు మ్యాచ్ అయ్యేలా సితార డ్యాన్స్ చేసి , ఆవీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

థియేటర్ కు బురఖా లో సాయి పల్లవి
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

"యశోద" మూవీ లో సమంత రోల్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మైత్రీ చేతికి సుధీర్ బాబు సినిమా..!
సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

చివరి దశలో 'ఖిలాడి'.. సాంగ్ షూట్
క్రాక్ సినిమా తరువాత రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లగా ఇంతవరకూ షూటింగ్ పూర్తవ్వలేదు. దానికితోడు కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. దీనివల్ల వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇండస్ట్రీ లో ప్రతీ హీరోను గౌరవిస్తా - శ్రీవిష్ణు
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత అయ్యర్ జంటగా రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన “అర్జున ఫల్గుణ” మూవీ డిసెంబర్ 31న విడుదల కానుంది.నరేష్ , సుబ్బరాజు , శివాజీరాజా ముఖ్య పాత్రలలో నటించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో విజయ్-వంశీ మూవీ
తమిళ హీరోలు ఇప్పుడు తెలుగులో కూాడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వారు చేసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేస్తూ రిలీజ్ చేసేవారు.. కానీ ఇప్పుడు అందరూ పంథా మార్చారు. స్ట్రైయిట్ తెలుగు సినిమాలే చేయడానికి రెడీ అవుతున్నారు. ముందుగా ధనుష్ అయితే ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. శేఖర్ కమ్ములతో పాటు వెంకీ అట్లూరీతో సినిమాలు చేయనున్నాడు. ఇక మరో స్టార్ హీరో విజయ్ కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

కేరళలో రామ్ చరణ్ మేనియా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో "మగధీర ", యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో "స్టూడెంట్ నెం 1", "సింహాద్రి ", "యమదొంగ" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం " మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 7 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది . దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టారు. ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షం లో గ్రాండ్ గా జరిపింది. తాజాగా కేరళలోని…

'సామ్' గురించి 'చరణ్' మూడు మాటల్లో
ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా సంస్థలకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ ఇలా పలు ప్రెస్ మీట్ లలో పాల్గొన్నారు. ఇంకా పలు ఇంటర్వ్యూలల్లో పాల్గొంటున్నారు.

లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్
"పాప్‌కార్న్" మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన సంయుక్త మీనన్ "కలరి" మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. "గాలిపట" మూవీ తో శాండల్ వుడ్ , "భీమ్లా నాయక్" మూవీ తో టాలీవుడ్ కు సంయుక్త పరిచయం అవుతున్నారు. ఒక్క తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే కళ్యాణ్ రామ్ "బింబిసార" మూవీ లో నటించారు.