‘అంటే సుందరానికి’ టైమ్ వచ్చింది..!

Interesting Update about Nani’s Ante Sundaraniki, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Nani’s Ante Sundaraniki, Ante Sundaraniki, Ante Sundaraniki Movie, Ante Sundaraniki Telugu Movie, Ante Sundaraniki Movie Updates, Ante Sundaraniki Movie Latest News, Nani New Movie Ante Sundaraniki, Natural Star Nani Movies, Ante Sundaraniki Interesting Update

యంగ్ హీరో నాని మాత్రం ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ముందు టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని… ఈనెల 24న శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇదే జోష్ తో వెంటనే అంటే సుందరానికి సినిమాను స్టార్ట్ చేసేశాడు. బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఈసినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను స్టార్ట్ చేసినా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతవరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తికాగా.. శ్యామ్ సింగ రాయ్ సినిమా వల్ల ఈసినిమాకు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మళ్లీ ఈసినిమాను లైన్ లోకి తెచ్చాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. ఈ సినిమా నుంచి జీరో లుక్‌ ను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం. జనవరి 1 వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు ఈ జీరో లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు.

కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తుంది. కాగా ఈసినిమా షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.