ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా సంస్థలకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ ఇలా పలు ప్రెస్ మీట్ లలో పాల్గొన్నారు. ఇంకా పలు ఇంటర్వ్యూలల్లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్బంగా రామ్ చరణ్ సమంత గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ను సామ్ గురించి మూడు ముక్కల్లో చెప్పమని అడగ్గా ‘ కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక ఆ రేంజ్ లో ప్రశంసించిన తరువాత సామ్ ఎంత హ్యాఫీగా ఫీలవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ వీడియోనుమూడు లవ్ సింబల్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వీరిద్దరూ ‘రంగ స్థలం’ లో కలిసి జంటగా నటించిన సంగతి తెలిసిందే.
♥️♥️♥️ https://t.co/IqHN3aQ8Jw
— Samantha (@Samanthaprabhu2) December 27, 2021
కాగా, ప్రస్తుతం సమంత వరుస సినిమాలను ప్రకటిస్తూ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలోనూ నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ అలానే వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ సమంత కెరీర్ లో దూసుకుపోతుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: