క్రాక్ సినిమా తరువాత రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లగా ఇంతవరకూ షూటింగ్ పూర్తవ్వలేదు. దానికితోడు కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. దీనివల్ల వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ చివది దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది. కేవలం ఒక్క పాట మినహా ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. అంతేకాదు ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేశారట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమాలోని పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది. వీలైనంత వేగంగా ఈ పాటను షూట్ చేసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారట.
మరోవైపు షూటింగ్ జరుపుకుంటూనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు పోస్టర్లు, పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు విడుదల చేసిన రెండు సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడో సింగిల్ ను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు.
కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: