డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. మరి పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో ను ఎలా ఎలివేట్ చేస్తాడో మనకు తెలిసిందే. అందుకే పూరీతో సినిమా తీయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. ఆ మధ్య కాస్త రొటీన్ కథలతో కాస్త వెనక్కి తగ్గాడు కానీ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు. పూరీ లాంటి డైరెక్టర్ విజయ్ లాంటి హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాపై కూడా అంతే ఆసక్తి ఉంది అందరికీ. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ, పూరీ అభిమానులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ఫైనల్ లో ఉండగా.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీగా ఉంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే నిన్న లైగర్ బీటీఎస్ స్టిల్స్ అంటూ కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు.. అలానే ఇన్స్టా ఫిల్టర్ విడుదల చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడుఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ముంబై లో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి ఎలా బాక్సర్ గా ఎదిగాడు అన్నది ఈ వీడియోలో చూపించారు. యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్, దానికి తగ్గట్టుగా ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ ని పెంచేస్తోంది. మొత్తానికి లైగర్ ఎంట్రీ పవర్ ఫుల్ గా ఉంది.
The Slumdog, The boy from the streets of India is here to entertain the Nation.
Presenting @TheDeverakonda‘s Adrenaline pumping #LigerFirstGlimpse 🔥 #VaatLagaDenge 🤙https://t.co/gOTXTrbr0D#LIGER @MikeTyson #PuriJagannadh @ananyapandayy @karanjohar @Charmmeofficial pic.twitter.com/oaEnntWtJT
— Puri Connects (@PuriConnects) December 31, 2021
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. 2022, ఆగస్ట్ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది. మరి అదే రోజున విజయ్ కెరీర్ ను మలుపు తిప్పిన అర్జున్ రెడ్డి సినిమా కూడా రిలీజ్ అయింది. చూద్దాం ఈసినిమా ఎలాంటి మలువు తిప్పుతుందో..




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























