కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Koratala Siva

ట్యాగ్ · 154 కథనాలు · పేజీ 8

సినిమా వార్తలు

'కాజల్' దంపతులకు 'చిరు' బ్లెస్సింగ్స్

కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. 'ఆచార్య' చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబ‌ర్ 30న త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ ఇన్ని రోజులు పెళ్లి... హనీమూన్ కోసం మాల్దీవ్స్ అంటూ చాలా బిజీ బిజీ గా వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆచార్య లో 'చిరు' తో సమానంగా 'చెర్రీ'

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు తెచుకున్నాడు. బాలీవుడ్ సినిమా చిచోరేలో కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కనిపించిన ఈ సినిమాలో నవీన్, తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులో నవీన్ పోలిశెట్టి తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Bollywood Actor Sanjay Dutt To Play The Antagonist Role In Mega Star Chiranjeevi Acharya Movie
సినిమా వార్తలు

'చిరు' తో ఢీ కొట్టనున్న 'అధీర'..?

చిరు సినిమా అంటే చాలు రోజుకో వార్త వస్తూనే ఉంటది. ఇక లూసిఫర్ సినిమాపై అయితే ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా లూసిఫర్ సినిమాల పాత్రల గురించి అయితే రోజుకో రూమర్ వస్తుంది. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు రెహ్మాన్ పోషించనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో పేరు…

TFN Adminవాట్సాప్
Acharya Movie Makers Plans To Erect A Massive Temple Set For Shooting Purpose
షూటింగ్ అప్‌డేట్

"ఆచార్య " మూవీ కి భారీ టెంపుల్ సెట్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయిక. కరోనా మహమ్మారి కారణం గా 4 నెలలు షూటింగ్ నిలిచిపోయిన "ఆచార్య " మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అది వైరస్ కంటే ప్రమాదకరం..!

కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే వున్నాయి. ఇక ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ కూడా ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని.. సోషల్ డిస్టన్స్ మెయిన్ టైన్ చేయాలని.. చెబుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే లాక్‌డౌన్‌లో సడలింపులు చేశారో కరోనా భీభత్సంగా వ్యాపించడం మొదలైంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో భారత్ 3వ స్థానంలో ఉందంటే ఏ రేంజ్‌లో కరోనా ఉదృతి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రజల నిర్లక్ష్య ధోరణి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు కొరటాల శివ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ట్వీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రేజీ కాంబినేషన్ లో సినిమా..!

వెండి తెరపై కొన్ని కాంబినషన్స్ చూడటానికి చాలా బావుంటాయి. అందుకే కొంతమంది డైరెక్టర్స్, హీరోస్ కానీ కాంబినేషన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ అన్నీ వస్తున్నాయి. హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండటానికి ఇష్టపడటం లేదు. తమను కొత్తగా ఆవిష్కరించుకోడానికి పలు డైరెక్టర్స్ తో పని చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక అలాంటి కాంబినేషనే ఇప్పుడు రాబోతున్నట్టు తెలుస్తుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Ace Director Koratala Siva Wishes To Work With Tollywood New Generation Actors
సినిమా వార్తలు

కొరటాల లిస్ట్ లో నాని, విజయ్ దేవరకొండ..!

వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భారత అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ లోపు రిటైర్మెంట్ అయిపోతా..!

టాలీవుడ్ లో ఉన్న సక్సస్ ఫుల్ అండ్ స్టార్ డైరెక్టర్స్ లో కొరటాల శివ కూడ ఒకరు. రచయితగా సినిమా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాలకి రచనా సహకారం అందించారు. పోసాని మురళీ కృష్ణ దగ్గర పని చేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిపోయారు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిన్న బడ్జెట్ తోనే కొరటాల సినిమా..!

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇలానే ఉండాలన్న ఈక్యేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసి కొత్త కొత్త పంథాలను ఏర్పరుచుకొని ముందుకు దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే డైరెక్టర్ లు కూడా నిర్మాతలుగా మరి ఆర్ధికంగా బలపడుతున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఇక వీరిలాగే స్టార్ డైరెక్టర్ కొరటాల కూడా నిర్మాతగా మారనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Star Director Koratala Siva Turns Film Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Koratala Siva,Koratala Siva Latest News,Director Koratala Siva New Movie News,Koratala Siva Upcoming Film Updates
సినిమా వార్తలు

నిర్మాతగా మారనున్న కొరటాల..!

ఒకప్పుడు సినీపరిశ్రమలో నిర్మాత పని నిర్మాత చేసేవాడు. డైరెక్టర్ అంటే సినిమా మాత్రమే డైరెక్ట్ చేసేవాడు. హీరో పని హీరో చేసేవాడు. అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది. డైరెక్టర్ లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. ఇక హీరోలైతే సొంత ప్రొడక్షన్స్ పెట్టేసుకొని వాళ్ళ సినిమాలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తెస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా నిర్మాతగా మారాలనుకుంటున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. వరుస హిట్లతో…

TFN Adminవాట్సాప్
Ace Director Koratala Siva Teams Up Again With Darling Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Koratala Siva,Prabhas,Director Koratala Siva,Darling Prabhas,Koratala Siva Latest News,Koratala
సినిమా వార్తలు

మ‌రోసారి `మిర్చి` కాంబినేష‌న్?

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. `మిర్చి`, `శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `భ‌ర‌త్ అనే నేను`... ఇలా నాలుగు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన కొర‌టాల.. ప్ర‌స్తుతం త‌న ఐదో చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్ లో `ఆచార్య‌` పేరుతో రూపొందిస్తున్నాడు. ఆగ‌స్టులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ఆపై ఆరో చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించ‌డానికి శివ స‌న్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు.. కొర‌టాల శివ రూపొందించ‌బోయే 7వ చిత్రం కూడా ఇప్ప‌టికే సెట్ అయింద‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ చ‌ర‌ణ్ తో కొర‌టాల శివ త‌దుప‌రి చిత్రం?

`మిర్చి`, `శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `భ‌ర‌త్ అనే నేను`.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్ లో `ఆచార్య‌` పేరిట ఓ సోష‌ల్ డ్రామాని తెర‌కెక్కిస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఆగ‌స్టులో జ‌నం ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Director Koratala Siva Teams Up With Mahesh Babu Once Again
సినిమా వార్తలు

మ‌హేష్ తో మ‌రోమారు కొర‌టాల‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఒక‌రు. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `శ్రీ‌మంతుడు` (2015), `భ‌ర‌త్ అనే నేను` (2018) బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. క‌ట్ చేస్తే... వీరి కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌రో సినిమా రాబోతోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. ప్ర‌స్తుతం ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే ఏడాది చివ‌ర‌లో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే మ‌హేష్, కొర‌టాల థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్

షేర్