వెండి తెరపై కొన్ని కాంబినషన్స్ చూడటానికి చాలా బావుంటాయి. అందుకే కొంతమంది డైరెక్టర్స్, హీరోస్ కానీ కాంబినేషన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ అన్నీ వస్తున్నాయి. హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండటానికి ఇష్టపడటం లేదు. తమను కొత్తగా ఆవిష్కరించుకోడానికి పలు డైరెక్టర్స్ తో పని చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక అలాంటి కాంబినేషనే ఇప్పుడు రాబోతున్నట్టు తెలుస్తుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే అల్లు అర్జున్ని కొరటాల కలవడం.. కథ వినిపించడం జరిగిందట. ఆ కథ నచ్చడంతో వెంటనే బన్నీకూడా ఓకే చెప్పేశారని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని, ఈ మేరకు ఇద్దరి మధ్య డీల్ కూడా కుదిరిందని టాక్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం అతి త్వరలో ఈ క్రేజీ కాంబో మూవీ పట్టాలెక్కనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.మరి చూద్దాం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుందేమో.
ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక కొరటాల ప్రస్తుతం చిరుతో ఆచార్య సినిమాతో బిజీ గా వున్నాడు. అయితే ఆచార్య తర్వాత కొరటాల ఎవరితో సినిమా తీస్తాడన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి బన్నీ లైన్ లో ఉన్న సినిమాలను పక్కన పెట్టి కొరటాలతో సినిమా చేస్తాడా? లేక అవి అయిపోయిన తర్వాత సినిమా చేస్తాడా చూడాలి. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మాత్రం అభిమానులకు మాత్రమే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడికి పండగే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























