
ట్యాగ్ · 126 కథనాలు · పేజీ 2


సలార్ పాత్రపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మహేష్ సినిమాలో మరింత క్రూరంగా

రామబాణం ట్రైలర్ రిలీజ్..యాక్షన్ ప్లస్ ఎమోషన్

పుష్ప 2 లో జగ్గూ భాయ్

రామబాణం- లక్ష్మణుడు, హనుమంతుడు ఇద్దరూ నేనే

సలార్ షూటింగ్ పూర్తి చేసుకున్న శృతి హాసన్

గోపీచంద్ రామబాణం మూవీ అప్ డేట్

హిందీ భాషలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న అఖండ

షూటింగ్ చివరి దశలో సలార్

ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు ఫిక్స్

సోషల్ మీడియాకు ప్రశాంత్ నీల్ దూరం

సలార్ షూటింగ్ పై పృథ్వీరాజ్ అప్ డేట్

సల్లూ భాయ్ కోసం రెడీ అవుతున్నా

వన్ ఇయర్ దిగ్విజయం గా పూర్తి చేసుకున్న అఖండ

సలార్ మేనియాకు కు సిద్దం?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక వాటిలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ నుండి వస్తున్న ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో అభిమానులు అయితే ఈసినిమా కోసం మరింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

గోపీచంద్ రామబాణం రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సలార్ పాత్రపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తెలుగు లో సలార్, పుష్ప 2, మహేష్ బాబు సినిమా లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పలు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన రామబాణం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ఆయన కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

ఫ్యామిలీ సినిమా రావడం లేదనే లోటు రామబాణం తీరుస్తుంది
'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శ్రీవాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మహేష్ సినిమాలో మరింత క్రూరంగా
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

రామబాణం ట్రైలర్ రిలీజ్..యాక్షన్ ప్లస్ ఎమోషన్
యాక్షన్ హీరో గోపీచంద్ మాత్రం సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. తను సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలమే అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా మే 5 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.

పుష్ప 2 లో జగ్గూ భాయ్
ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి...ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు. గతంలో ఫ్యామిలీ సినిమాలంటే జగపతిబాబు సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం... సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకపక్క విలన్ పాత్రలు చేస్తూనే... మరోపక్క ఫాథర్ పాత్రలు కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు. ఇప్పుడు తెలుగులో…

రామబాణం- లక్ష్మణుడు, హనుమంతుడు ఇద్దరూ నేనే
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా ఇది మూడో సినిమా. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

రిలీజ్ అయిన రామ బాణం మూవీ శ్రీరామ నవమిస్పెషల్ పోస్టర్
యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ , డింపుల్ హాయతి జంటగాతెరకెక్కుతున్న రామబాణం మూవీ మే 5 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో గోపీచంద్ , శ్రీవాస్ ల హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో జగపతి బాబు , నాజర్ , వెన్నెల కిషోర్ , అలీ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సలార్ షూటింగ్ పూర్తి చేసుకున్న శృతి హాసన్
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ఒకవైపు కె.జి.యఫ్ డైరెక్టర్ మరోవైపు ప్రభాస్ హీరో కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

గోపీచంద్ రామబాణం మూవీ అప్ డేట్
యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో డింపుల్ హయతి కథానాయిక కాగా జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

హిందీ భాషలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న అఖండ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ…

హ్యాట్రిక్ దిశగా సంక్రాంతి లక్కీ హీరోయిన్ శృతి హాసన్
తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి12 వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఒకే బ్యానర్ లో తెరకెక్కిన ఈ…

షూటింగ్ చివరి దశలో సలార్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు…

ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు ఫిక్స్
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.. వాటికోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈమధ్య కాలంలో అలాంటి కాంబినేషన్స్ కూడా ఎన్నో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి రాబోతుంది. అదే దిల్ రాజు-ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ప్రస్తుతం దిల్ రాజు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగు లో మాత్రమే కాదు అటు తమిళ్ ఇంకా హిందీ పరిశ్రమలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ ను లైన్ లో పెట్టేశాడు.

సోషల్ మీడియాకు ప్రశాంత్ నీల్ దూరం
సెలబ్రిటీలు అప్పుడుప్పుడు సోషల్ మీడియో నుండి దూరమవుతుంటారు. కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల.. కొంతమంది కావాలని బ్రేక్ తీసుకోవడానికి సోషల్ మీడియాలో డియాక్టివేటివ్ అవుతుంటారు. ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కె.జియఫ్ సిరీస్ తో సినిమాతో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనులో ఉన్నారు చిత్రయూనిట్.

సలార్ షూటింగ్ పై పృథ్వీరాజ్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఒక ప్రభాస్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ తప్పా మరొకటి రాలేదు. చాలా కాలంగా ఈసినిమా నుండి అప్ కోసం ఫ్యాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ అప్ డేట్ మాత్రం ఇంతవరకూ రాలేదు. ఈసినిమాలో పృథ్విరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.

సల్లూ భాయ్ కోసం రెడీ అవుతున్నా
ఫ్యామిలీ సినిమాలంటే గుర్తొచ్చే హీరోల్లో జగపతిబాబు కూడా ముందుంటాడు. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం... సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి...ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు జగపతి బాబు.

ప్రభాస్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇంటింట దీపావళి (1990 ) మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈశ్వరీ రావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. విరుంబిగిరేన్, కాలా తమిళ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈశ్వరీరావు బెస్ట్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డ్స్ అందుకున్నారు.

వన్ ఇయర్ దిగ్విజయం గా పూర్తి చేసుకున్న అఖండ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.