ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.. వాటికోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈమధ్య కాలంలో అలాంటి కాంబినేషన్స్ కూడా ఎన్నో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరపైకి రాబోతుంది. అదే దిల్ రాజు-ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ప్రస్తుతం దిల్ రాజు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగు లో మాత్రమే కాదు అటు తమిళ్ ఇంకా హిందీ పరిశ్రమలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ ను లైన్ లో పెట్టేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన నెక్ట్స్ మూవీని కూడా ప్రకటించేశారు. ఈ సినిమాకి పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం చేయబోతున్నాడని తెలిపాడు. అంతేకాదు ఈసినిమా టైటిల్ ‘రావణం’ అని కూడా తెలిపాడు. అయితే.. ఈ మూవీలో నటించే హీరో, హీరోయిన్స్ పేర్లని మాత్రం వెల్లడించని దిల్ రాజు.. బెస్ట్ వీఎఫ్ఎక్స్తో మూవీని తెరకెక్కించబోతున్నట్లు మాత్రం స్పష్టం చేశారు. చూద్దాం మరి ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు ను తీసుకుంటారో..
ఇక ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: